ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? మాంసాహారం కాస్త తగ్గించండి. బదులుగా గింజపప్పులు (బాదం, అక్రోట్లు, పిస్తా వంటివి), సోయా, పప్పులు, చిక్కుళ్లు తీసుకోండి. వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన ఇలాంటివి ఎక్కువగా తినేవారి జీవనకాలం పెరుగుతున్నట్టు తేలింది మరి. వృక్ష ప్రొటీన్ల వాడకం, మరణం ముప్పునకూ మధ్య గల సంబంధంపై జపాన్ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు.
జీవనకాలం పెరగాలంటే ఇవి తినాల్సిందే.. - జీవనకాలం పెరగాలంటే ఇవి తినాల్సిందే.
వృక్ష సంబంధ ప్రొటీన్లతో నిండిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల జీవనకాలం పెరుగుతున్నట్టు ఇటీవల జపాన్ పరిశోధకులు చేసిన అధ్యయనాల్లో వెల్లడైెంది. మాంసాహారానికి బదులుగా పప్పు గింజలు, సోయా, చిక్కుళ్లు వంటివి తీసుకోవటం ఉత్తమమని వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సుమారు 20 ఏళ్ల పాటు 70వేలకు పైగా మందిని పరిశీలించి ఆసక్తికరమైన విషయాలను గుర్తించారు. శాకాహారంతో లభించే మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్నవారికి ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 13% తక్కువగా ఉంటుండటం గమనార్హం. తక్కువ వృక్ష ప్రొటీన్లు తిన్నవారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకున్నవారికి గుండెజబ్బుతో మరణించే ముప్పు 16% తక్కువగానూ ఉంటోంది. మాంసం వాడకాన్ని 3% తగ్గించినా చాలు. అన్నిరకాల కారణాలతో సంభవించే మరణం ముప్పు 34% తగ్గుముఖం పడుతుండగా.. క్యాన్సర్ మరణాల ముప్పు 39%, గుండెజబ్బు మరణాల ముప్పు 42% తగ్గుతుండటం విశేషం.
ఇదీ చదవండి :గుండెకు తీపి శత్రువు!