గర్భధారణ ఎంత సంతోషకరమైనదైనా.. కొందరు గర్భిణులకు ఉమ్మనీరు ఎక్కువ కావటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తేలికగా గుర్తించటానికి బ్రిటన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు ఓ వినూత్న పరికరాన్ని రూపొందించారు. దీన్ని గర్భిణి కడుపునకు అమర్చితే చాలు. దీని నుంచి వెలువడే పరారుణ (ఇన్‌ఫ్రారెడ్) కాంతి గర్భసంచి ముందుగోడ వద్ద అంటుకున్న మాయ భాగానికి చేరుకొని.. అక్కడి రక్తనాళాల్లో ఆక్సిజన్ మోతాదులను ఇట్టే గుర్తిస్తుంది. దీని ఆధారంగా ఆయా సమస్యలను గుర్తించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
గర్భిణుల సమస్యలను పసిగట్టే ఆక్సిజన్ పరికరం
ఉమ్మనీరు ఎక్కువ కావటంతో గర్భిణులకు సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే దీనిని గుర్తించేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరికరాన్ని రూపొందించారు. దీన్ని కేవలం తల్లి ఉదరంపైన ఉంచితే చాలు.. పరారుణ కిరణాలు గర్భసంచికి ముందు ఉన్నగోడను తాకి అక్కడ ఆక్సిజన్ మోతాదులను గుర్తిస్తాయి. దీని ఆధారంగా అనేక సమస్యలను ఎదుర్కొవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
దీన్ని 12 మంది గర్భిణులపై పరీక్షించి చూడగా.. ఐదుగురిలో అధిక రక్తపోటు, ఉమ్మనీరు పెరగటం, గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండటం వంటి సమస్యలున్నట్టు బయటపడటం విశేషం. సగటున మాయలో ఆక్సిజన్ 69.6% గలవారిలో సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం. ఆరోగ్యంగా ఉన్న గర్భిణుల్లో సాధారణంగా మాయలో ఆక్సిజన్ శాతం 75.3 వరకు ఉంటుంది. గర్భిణి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి నిరంతరం ఆక్సిజన్ మోతాదులను పర్యవేక్షించే దిశగా తమ అధ్యయనం తొలి అడుగు కాగలదని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి:తల్లి పాలే బిడ్డకు 'తొలి పోషణ.. తొలి రక్షణ'