తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కరివేపాకు రోటీ.. గర్భిణీల అమృతాహారం - pregnancy diet

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు కచ్చితమైన డైట్​ పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంటారు. అయితే ఇందులో కరివేపాకు రోటీని జోడిస్తే మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

pregnancy diet
ప్రెగ్నెన్సీ డైట్​

By

Published : Aug 19, 2021, 6:07 PM IST

గర్భిణీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఆమె తీసుకునే తిండి పదార్థాల్లో కరివేపాకు రోటీ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచింది. దీన్ని ఎలా తయారు చేయాలంటే..

కావాల్సిన పదార్థాలు

మల్టీ గ్రెయిన్​ గోధుమపిండి ఒక కప్పు

కరివేపాకు ఒక కప్పు

ఉప్పు తగినంత

ఆలివ్​ ఆయిల్​ 1/4 టీ స్పూన్​

తయారీ విధానం

ముందుగా ఓ బౌల్​ తీసుకుని అందులో కరివేపాకు, గోధుమపిండి, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి రోటి పిండిలా బాగా కలుపుకోవాలి. దీంతో రోటీ తయారుచేసుకోవాలి. పెనంపై కాల్చుతూ రెండువైపులా ఆలివ్​ఆయిల్​ను పూయాలి. అంతే కరివేపాకు రోటి రెడీ. ఇది తింటే గర్భిణీల ఆరోగ్యానికి మంచిది.

ఇదీ చూడండి:శృంగారంతో ఇమ్యూనిటీ పెరుగుతుందా?

ABOUT THE AUTHOR

...view details