Tips to Prevent Rabies : కుక్కలను పెంచుకోవడం చాలా మందికి సరదా..ఆ సరదానే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇంట్లో పెంచుకునే కుక్కకు వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం. వీధి కుక్కకరిస్తే మాత్రం తప్పనిసరిగా మనమే వ్యాక్సిన్ వేయించుకోవాలి. గతంలో లాగా బొడ్డు చుట్టూ ఇంజిక్షన్లు వేయించుకునే పరిస్థితి ఇపుడు లేదు..ఐదు ఇంజిక్షన్లు భుజానికే వేస్తున్నారు. ఇంట్లో కుక్కయినా, వీధిలోని కుక్కయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరిస్తే రేబీస్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని మరవొద్దని జనరల్ ఫిజిషియన్లు సూచిస్తున్నారు.
ప్రమాదమే సుమా :వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేసే అవకాశాలు చాలా తక్కువ. వాటికి సాధ్యమయినంత వరకు దూరంగా ఉండాలి. రేబీస్ వైరస్ సోకితే ఆధునిక చికిత్స అందుబాటులో ఉంది. అయినా చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేయడంతోనే సమస్యగా మారుతోంది. వైరస్ నరాలపై ప్రభావం చూపిస్తుంది. నరాల నుంచి వైరస్ మెదడు దాకా వెళ్తుంది. ఆ సమయంలో నరాలు చచ్చుబడిపోయే అవకాశం ఉంది.