మన శరీరంలో గుండె తర్వాత కిడ్నీలను అత్యంత కీలకమైన అవయవాలుగా చెబుతారు. జీవక్రియల ద్వారా శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేవి కిడ్నీలే. అయితే అవి పనిచేయని పరిస్థితి వస్తే ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అందుకే కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో కిడ్నీలను కాపాడుకోవడానికి వైద్యులు ఇచ్చిన సలహాలు, సూచనలను తెలుసుకుందాం.
మధుమేహంతో బాధపడుతున్నారా?.. కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయా?.. ఈ జాగ్రత్తలు మస్ట్!
మన శరీరంలో జీవక్రియల ద్వారా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించేవి కిడ్నీలే. అందుకే వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే మధుమేహంతో బాధపడుతున్నవాళ్లు ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటారు. డయాబెటిస్ పేషంట్లు కిడ్నీ సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.
Ayurvedic Medication For Kidney Problems
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- తినే ఆహారంలో తేలికగా అరిగే పదార్థాలు ఉండేట్లు చూసుకోవాలి
- రోజువారీ ఆహారంలో కూరగాయలను భాగం చేసుకోవాలి
- ఆహారంలో మసాలాలు లేకుండా చూసుకోవాలి
- ఎక్కువగా మాంసాహరాన్ని తినకూడదు
- రోజూ మూడు లీటర్ల నీరు తాగాలి
- కాఫీ, టీలు తాగడం బాగా తగ్గించాలి
- మద్యపానం పూర్తిగా మానేయాలి
- వ్యాయామం అనేది తప్పకుండా చేయాలి
కిడ్నీ సమస్యను తగ్గించే పథ్యాహారం..
- కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు, ఉలవలు, నెయ్యి, జీలకర్ర, ఇంగువ, పసుపు, కొత్తిమీర.
- తయారీ విధానం:పాత్రలో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. దాంట్లో అరకప్పు ఉలవలు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక బాణలిలో నెయ్యివేసి అది కాస్త వేడయ్యాక దాంట్లో కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు పసుపు, 3చెంచాలు కొబ్బరితురుము వేసి వేయించాలి. ఇప్పుడు ఉడకపెట్టిన ఉలవలు, ఉలవల ఉడికించిన నీరును కూడా పోపులో వేయాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసి, కొత్తిమీరతో గార్నిశ్ చేసుకోవాలి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు వారంలో నాలుగు సార్లు దీనిని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది!