Pneumonia Precautions for Children Safety : ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. ఉదయం 8 దాటితే గానీ బయటకు రాలేని పరిస్థితి. పెద్దలే ఈ చలికి గజగజ వణుకుతుంటే.. పిల్లల పరిస్థితి..? ఈ కాలంలో పిల్లలను జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలోనే న్యూమోనియా విరుచుకుపడే ప్రమాదం ఉంది. పిల్లలతోపాటు వృద్ధులూ దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. మరి.. పిల్లలను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పరిశుభ్రత:దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు.. బాత్రూమ్కి వెళ్లివచ్చినప్పుడు.. బహిరంగ ప్రదేశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. సబ్బుతో తప్పకుండా చేతులు కడుక్కోమని చెప్పండి. అలా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించండి. చేతులు క్లీన్ చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదని చెప్పండి. ఈ మార్గాల ద్వారానే వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
చలికాలంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి - ప్రమాదకరం కావొచ్చు!
ప్రయాణంలో రక్షణ: పాఠశాలలకు లేదా బయటకు వెళ్తున్నప్పుడు.. ఫేస్ మాస్క్ వాడకాన్ని ప్రోత్సహించండి. జలుబు, దగ్గు లక్షణాలు ఉండే వారి నుంచి సురక్షితమైన దూరాన్ని పాటించాలని చెప్పండి. వీలైతే.. జర్నీలో డోర్ హ్యాండిల్స్ లేదా రెయిలింగ్‌లు వంటి వాటిని తాకొద్దని చెప్పండి. ఒకవేళ పట్టుకుంటే తర్వాత హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించమని సూచించండి. క్లాస్ రూమ్‌లో సేఫ్టీ మెజర్స్ తప్పక పాటించాలని చెప్పండి.
PNEUMONIA CASES: కొవిడ్ ప్రభావం.. రెట్టింపు అవుతున్న న్యుమోనియా కేసులు