Plastic Containers Health Risks :నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులు వాడడం పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా మహిళలు తమ వంటగదిలో ఎక్కవగా ప్లాస్టిక్ డబ్బాలనే ఉపయోగిస్తున్నారు. పప్పుల నిల్వ మొదలు, తినుబండారాలు పెట్టే వరకు అన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత వరకు సురక్షితం? అనే అంశంపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.
ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది!
ఉత్తరప్రదేశ్, లఖ్‌నవూలోని రీజెన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పనిచేసే డాక్టర్ ప్రవీణ్ ఝా ప్లాస్టిక్ వాడకం గురించి వివరించారు. 'ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం నిల్వ చేయడం ఎంత వరకు సురక్షితం? అనేది.. సదరు ప్లాస్టిక్ రకం, నిర్దేశిత వినియోగంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ప్లాస్టిక్‌లలో ఆహారం వేసినప్పుడు.. అవి కొన్ని హానికరమైన రసాలయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా వేడి పదార్థాలు ప్లాస్టిక్ డబ్బాలలో వేసినప్పుడు.. అలాగే కొవ్వు, ఆమ్ల పదార్థాలు నిల్వ చేసినప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు హానికారకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి మానవుల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపెడతాయి' అని ప్రవీణ్ ఝా వివరించారు.
ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లను దేనితో తయారు చేస్తారు ?
Plastic Containers Contains : ప్లాస్టిక్ కంటైనర్ల తయారీలో ఉపయోగించే ఒక సాధారణ ప్లాస్టిక్ రకం PETE. దీన్ని పూర్తిగా పాలీఎథిలిన్ టెరెఫ్తాలేట్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా సింగిల్ యూజ్ అప్లికేషన్‌లకు అంటే ఒకసారి మాత్రమే ఉపయోగించడానికి సురక్షితమైనదిగా పరిగణిస్తారు. అంతే కానీ పదే పదే ఉపయోగించడానికి లేదా వేడి చేయడానికి ఈ ప్లాస్టిక్ పనికి రాదు. సాధారణంగా ప్లాస్టిక్‌ని ఉపయోగించే ముందు.. అది ఆహారం నిల్వ చేసుకోవడానికి సురక్షితమైనదా? కాదా? అనే లేబుల్‌ను కచ్చితంగా పరిశీలించాలని ప్రవీణ్ ఝా సూచిస్తున్నారు.
చాలా ప్రమాదం
Plastic Containers Health Hazards : ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం సర్వసాధారణం అయినప్పటికీ.. వేడి పదార్థాలను అందులో వేయడం వల్ల ప్లాస్టిక్ కణాలు ఆహారం పదార్థాలలోకి చేరతాయి. ఇది చాలా ప్రమాదకరం. కనుక వేడి పదార్థాలు, నూనెలు, ఆమ్ల స్వభావం గల ఆహారాలను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే అవి ఆహార పదార్థాల్లోకి హానికారకమైన రసాయనాలను విడుదల చేస్తాయి. మరీ ముఖ్యంగా ముఖ్యంగా.. పాతవి, గీతలు ఉన్నవి లేదా దెబ్బతిన్న ప్లాస్టిక్ కంటైనర్‌లను ఏ మాత్రం ఉపయోగించకూడదు అని డాక్టర్ ప్రవీణ్ ఝా తెలిపారు.
మరి ఏం వాడాలి?
Plastic Container Alternatives : ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా ఆహారాన్ని నిల్వ చేయడానికి.. గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్, సిలికాన్, బీస్‌వాక్స్, వెదురుతో చేసినవి ఉపయోగించవచ్చు. అవన్నీ విషరహిత పదార్థాలతో తయారు చేయడం వల్ల.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వాటిని వాడవచ్చు.
ప్లాస్టిక్ వాడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Plastic Container Usage Tips : తప్పని పరిస్థితుల్లో.. ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయాల్సి వచ్చినప్పుడు.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.