Planning To Conceive :పెళ్లైన ప్రతి జంట సంతానం కోసం ఎంతో పరితపిస్తూ ఉంటుంది. పండంటి బిడ్డ కలగాలని ప్రతి నిత్యం భార్యాభర్తలు కలగంటూ ఉంటారు. మాతృత్వపు మాధుర్యం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. ( Planning For Pregnancy ) ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పటి నుంచే స్తీ, పురుషులు ఇద్దరూ చాలా విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందు ఏం చేయాలి?
Pregnancy Tips To Conceive : ప్రెగ్నెన్సీకి కనీసం రెండేళ్ల ముందు నుంచే చాలా అప్రమత్తంగా ఉండాలి. వ్యాయామాలు చేయడం దగ్గర నుంచి సరైన పౌష్టికారం తీసుకోవడం వరకు ప్రతీ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గర్భం దాల్చడానికి ముందు మహిళలు తమ శరీరం అందుకు సహకరించేలా చూసుకోవాలి. ఎముకలు, కండరాల పటిష్టత, శరీరంలోని రక్తం పరిమాణం, శారీరక, మానసిక బలం మొదలైన అంశాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. థైరాయిడ్, విటమిన్ D3, విటమిన్ B12, బ్లడ్ షుగర్ టెస్టులు కూడా చేయించుకోవాలి.
పిల్స్‌తో జాగ్రత్త!
Pregnancy Pills :చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉంది. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి.. గర్భ నిరోధక మాత్రలు వాడకపోవడం చాలా మంచిదని గైనకాలజీ నిపుణులు సూచిస్తుంటారు.
పౌష్టికాహారం
Pregnancy Planning Diet : సంతానోత్పత్తి పూర్తి శరీరానికి సంబంధించిన ప్రక్రియ. గర్భం ధరించేందుకు శరీరం సహకరించాలి. అండం, వీర్యం ఆరోగ్యకరంగా ఉండాలి. ఇందుకోసం స్త్రీ, పురుషులిద్దరూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ బ్లడ్ షుగర్, పోషకాలు శరీరానికి అందించాలి. ఆకుపచ్చ కూరగాయలు, పుల్లటి పండ్లు, గింజలు, పాలు, పెరుగు, పులిసిన సలాడ్స్ లాంటి బలీయమైన పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరంలో సరైన మోతాదులో నీరు ఉండేలా చూసుకోవాలి.
ఏవి వదిలేయాలి...?
Pregnancy Avoid Food :సంతానం కోసం ప్లాన్ చేసుకునే స్త్రీ, పురుషులిద్దరూ... ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని కచ్చితంగా వాడడం మానేయాలి. లేదంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైన అవి చాలా చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. బాగా వేయించిన ఆహారం (వేపుళ్లు) అతిగా తినకూడదు. ఒత్తిడిని దరిచేరనీయకూడదు. ఎందుకంటే ఒత్తిడి.. అండాల ఉత్పత్తి, వీర్య కణాల సంఖ్యపైన తీవ్ర ప్రభావం చూపుతుంది.
పండంటి బిడ్డకు ప్రశాంత జీవనం
Pregnancy Time Tips : శారీరక, మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఇందుకోసం సముద్రపు అలల కదలికలు, జలపాతాలు, వర్షం, అడవి శబ్ధాలు వింటూ ఉండాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండేందుకు రోజుకు కనీసం గంట సేపు వ్యాయామం చేయాలి. వాకింగ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, యోగ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు 8-10 గంటల పాటు సరిపడా నిద్ర పోవాలి. ప్రాణాయామం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. విటమిన్-డి కోసం రోజూ కనీసం 20 నిమిషాల పాటు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. గర్భం దాల్చిన తరువాత కూడా నిపుణుల సలహాలు, సూచనల కోసం స్పెషల్ క్లాసెస్ తీసుకుంటే.. ఆరోగ్యవంతమైన పండంటి బిడ్డను పొందవచ్చని ప్రముఖ గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.