Best Immunity Boosting Foods in Winter :నిత్యం మన శరీరంపై ఎన్నో రకాల వైరస్‌లు దాడి చేస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ.. అందులో చాలా వాటిని మన రోగ నిరోధక శక్తి అంతం చేస్తుంటుంది. మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడే వ్యాధులు ప్రబలడం ఎక్కువవుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ విషయం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. ఈ క్రమంలో మన బాడీలో ఇమ్యూనిటీ(Immunity)ఏం మాత్రం తగ్గినా జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏ పనీ చేయకముందే అలసట, నీరసం వంటివి దరిచేరతాయి. కాబట్టి వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
Peanut Chikki Health Benefits :ఈ క్రమంలోనే ఆయా కాలాల్లో లభించే పండ్లు, కాయగూరలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాల్లోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా వింటర్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయంటున్నారు. వీటిని తమ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంతకీ ఆ ఫుడ్ ఐటమ్స్(Foods) ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఈ ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం!
చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి మన ఆహారంలో ఇమ్యూనిటీ పెంచే కూరగాయలు, డ్రైఫ్రూట్స్, బెల్లంతో చేసిన వంటకాలు.. వంటివి భాగం చేసుకోవాలి. అలాగే నువ్వుల లడ్డూలు, సజ్జ రోటీలు కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇకపోతే మీరు వింటర్లో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి.. పల్లీ పట్టిలను తప్పకుండా మీ డైట్లో చేర్చుకోవాలి. పల్లీలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే చిక్కీలు చలికాలంలో ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇక బెల్లంతో చేసే ఈ పల్లీ పట్టిలో ఐరన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఆరోగ్యకర కొవ్వులు, జింక్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పల్లీ పట్టీలు(Peanut Chikki) తీసుకోవడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అంది మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతో సహాయపడతాయి. అదే విధంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ముఖ్యంగా పల్లీ పట్టీలో ఉండే బెల్లం బాడీకి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. వీటితో పాటు మీ డైట్లో సమతులాహారం ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్‌గా కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా మీరు ఇమ్యూనిటీ పెంచుకోవడంతో పాటు మరింత స్ట్రాంగ్‌గా తయారవుతారు.
Immunity Increase Food In Telugu : మీ రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ ఫుడ్స్' ఇవే!
బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. డయాబెటిస్, మలబద్ధకం, అధిక బరువుకు చెక్!