తెలంగాణ

telangana

By

Published : Jun 10, 2021, 10:33 AM IST

ETV Bharat / sukhibhava

మందులేనా.. మంచి తిండీ ముఖ్యమే!

వ్యాధి బారినపడిన వారికి అవసరమైన మందులతో పాటు సరైన ఆహారం అందించాలని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జబ్బుకు అనుగుణంగా తిండి పెట్టడం వల్ల.. రోగి త్వరగా కోలుకునే అవకాశముందని తేలింది. పౌష్టికాహారం తినడం వల్ల చికిత్స మరింత మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు.

PROPER DIET
మంచి ఆహారం

ఆసుపత్రిలో చేరినవారికి మందులు మాత్రమే కాదు, తిండీ ముఖ్యమే. అది ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ఉన్నదైతే ఇంకా మంచిదని తాజా అధ్యయనం పేర్కొంది. చికిత్స ఫలితాలు మెరుగుపడటానికి, జబ్బుల దుష్ప్రభావాలు తగ్గటానికి, త్వరగా కోలుకోవటానికి ఇది దోహదం చేస్తుంది.

ఏదైనా జబ్బుతో ఆసుపత్రిలో చేరినప్పుడు తినటానికి, తాగటానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా శరీరానికి తగినంతగా ప్రొటీన్లు, శక్తి అందవు. ఈ కారణంగా చికిత్స తీసుకుంటున్నా అంతగా గుణం కనిపించకపోవచ్చు. జబ్బు ముదురుతుండొచ్చు. దుష్ప్రభావాల ముప్పు పెరగొచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. అందుకే పోషణలోపం తలెత్తకుండా, బాధితులకు అవసరాలకు అనుగుణమైన ఆహారం ఇవ్వటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి ఆహారంతో లభించే ప్రయోజనాల మీద ఇప్పటివరకూ పెద్దగా అధ్యయనాలు సాగలేదు.

ఆహార ప్రాధాన్యం తప్పనిసరి..

ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ ఆసుపత్రుల్లో పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రి క్యాంటీన్లలో లభించే మామూలు ఆహారం తిన్నవారితో పోలిస్తే అవసరాలకు తగిన ఆహారం తీసుకున్నవారిలో చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం విశేషం. దుష్ప్రభావాలు, మరణాలు సైతం తగ్గాయని తేలింది. తీవ్రమైన జబ్బులతో బాధపడేవారి విషయంలో ఆహార చికిత్సకూ ప్రాధాన్యం ఇవ్వటం ఎంతైనా అవసరమని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇవీ చూడండి:Immunity: రూ.50 ఖర్చు.. వైరస్‌ను భయపెట్టు!

FOOD: యాంటీ వైరల్‌ ఆహారం తిందామా.. ఆరోగ్యాన్ని రక్షించుకుందామా..!

ABOUT THE AUTHOR

...view details