తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఎక్కువసార్లు చేస్తే కవల పిల్లలు పుడతారా? - అతిగా శృంగారంతో కవల పిల్లలు

పెళ్లైన కొత్తలో నవ దంపతులకు శృంగారానికి సంబంధించి అనేక అలోచనలు ఉంటాయి. సాధారణంగానే తొలినాళ్లలో కలయిక ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు రతి చేయడం వల్ల కవల పిల్లలు పడతారని చాలా మంది అంటుంటారు. అయితే అది నిజమేనా?

participating too much sex is cause to get chance twins?
ఎక్కువసార్లు సెక్స్​ చేస్తే కవల పిల్లలు పుడతారా?

By

Published : Sep 3, 2021, 7:01 AM IST

Updated : Sep 8, 2021, 1:29 PM IST

పెళ్లైన కొత్తలో దంపతులు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే కవల పిల్లలు పుడుతారని చాలా మంది అనుకుంటారు. అసలు అందులో నిజమెంతా? ఎలాంటి పరిస్థితుల్లో కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారు.

నిపుణుల సమాధానం:

సెక్స్​ ఎక్కువ చేస్తే కవల పిల్లలు పడుతారనేది అపోహ మాత్రమే! శృంగారం చేసే సమయంలో మహిళల అండాలు, పురుషుల శుక్రకణాలు కలిసి సంయుక్త బీజ కణం( జైగోట్)గా​ ఏర్పాడతాయి. చాలా అరుదుగా ఆ జైగోట్​ కణం రెండుగా విడిపోతుంది. అలాంటి సమయంలో రెండు పిండాలు ఏర్పడుతాయి. ఈ క్రమంలో కవల పిల్లలు పుడతారు.

అలాగే కొంతమంది మహిళల్లో ఒకేసారి ఒకటికి మించిన అండాలు విడుదల అవుతాయి. అలాంటి ప్రత్యేక సమయాల్లోనూ కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకుజన్మనిచ్చిందని వార్తలు వింటూ ఉంటాం. అయితే ఆ సమయంలో ఆరు అండాలు విడుదలై.. వాటితో శుక్రకణాలు ఫలదీకరణం చెందుతాయి. ఈ క్రమంలో ఆ సంయుక్త బీజ కణాలు ఆరు పిండాలుగా మారుతాయి.

ఇదీ చూడండి..పగలు సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరా?

Last Updated : Sep 8, 2021, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details