Parents Must Ask these Questions to Children After they Coming from School:పిల్లలకు అత్యంత విలువైన కానుక పేరెంట్స్ నుంచి ఉందంటే అది సమయం మాత్రమే. అయితే ఉద్యోగ ఒత్తిళ్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం, భార్యాభర్తలిద్దరికీ కనీసం మాట్లాడుకునే సమయం లేకపోవడం వంటివన్నీ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో పిల్లలకు, తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. దీనివల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యల(అది ఇంట్లో లేదా బయట) గురించి పేరెంట్స్‌కు తెలియడం లేదు. కాబట్టి.. మీరు వారితో కాస్త సమయం గడిపితే ఏ సమస్య వచ్చినా ముందుగా మీతోనే చెప్పుకుంటారు.
పేరెంట్స్‌కి, పిల్లలకి ఒకరి పట్ల ఒకరికి అండర్ స్టాండింగ్, నమ్మకం, స్నేహం ఉంటే ఇక పిల్లలు ఏ విషయాలకు కూడా భయపడరు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక సపోర్ట్ సిస్టమ్‌గా డెవలప్ అవుతారు. దానివల్ల వాళ్లు తప్పుదారి పట్టకుండా కాపాడుకోవచ్చు. కొంచెం ఓపిక, కొంచెం సానుభూతి, సరైన ప్రయత్నం ఉంటే మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించండి. కాగా, పిల్లలకు స్కూలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా నేర్చుకునేది స్కూల్ నుంచే.. అది మంచైనా లేదా చెడైనా. కాబట్టి స్కూల్ నుంచి తిరిగొచ్చాక పిల్లల్ని తల్లిదండ్రులు అడగాల్సిన ప్రశ్నలివే.!
మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? - ప్రాణాంతకం కావొచ్చు - ఇలా వదిలించండి!
స్కూల్ నుంచి తిరిగొచ్చాక పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..
- స్కూల్ సమయంలో ఆడుకోవడానికి సమయం ఇచ్చారా లేదా అడగాలి. ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. దీంతో ఉత్సాహంగా సమాధానం చెబుతారు.
- స్కూల్లో జరిగిన ఫన్నీ సంఘటన గురించి అడగాలి. పిల్లలు వాటిని కథలు కథలుగా చెబుతారు.
- పిల్లలు స్కూల్లో ఏ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి. దీని వల్ల పిల్లల అభిరుచి, ఆసక్తి తెలుస్తోంది. దీంతో ఆ విషయంలో మీ ప్రోత్సాహం అందిచొచ్చు.
- పాఠశాలలో కష్టంగా చేసిన పనేంటి అని అడగాలి. ఇలా అడిగితే పిల్లలు ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది. అందువల్ల వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.