Parents Avoid These Things To Make Your Kid A Good Human:"మొక్కై వంగనిది మానై వంగునా" అనే సామెత తెలిసే ఉంటుంది. ఇది పిల్లల విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పిల్లలకు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్పితే వాళ్లు ఉత్తమ పౌరులుగా మారతారు. అసలు పిల్లలు మంచి మార్గం ఎంచుకున్నారా..? లేదా చెడువైపు వెళ్లారా..? అనేది తల్లిదండ్రుల పెంపకంపైనే ఎక్కువ శాతం ఆధారపడి ఉంటుంది. అందుకే పిల్లలు సరైన దారిలో వెళ్లాలంటే చిన్ననాటి నుంచి వారితో తల్లిదండ్రులు కూసింత సమయం వెచ్చించి మంచి, చెడులు నేర్పించాలి.
కానీ ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల్లో పడి.. పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు. దీంతో పిల్లల్లో ఒంటరితనం పెరిగిపోయి.. వారికి నచ్చిన దారిలో వెళ్తుంటారు. పెద్దయ్యాక చెప్పిన మాట వినడం మానేస్తారు. దీంతో.. పిల్లలను సరైన దారిలో పెట్టడానికి వారితో కఠినంగా ప్రవర్తించడం, కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తారు. ఫలితంగా.. వారు మరింత మొండిగా తయారవుతారు. కాబట్టి.. ఈ పరిస్థితి రాకముందే తల్లిదండ్రులు మారాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ పిల్లలు నిత్యం నవ్వుతూ ఉండాలా? - అయితే ఈ 5 విషయాలు చెప్పండి!
కంపారిజన్:దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ పేరెంట్స్‌లో ఈ పని చేయని వాళ్లని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని.. ఇతరులతో పోల్చుతారు. దీనివల్ల పిల్లల్లో అనవసరమైన ఈర్ష్య, అసూయలు పెరుగుతాయి. కాబట్టి మీ పిల్లల మంచి లేదా చెడు అలవాట్లను ఇతరులతో ఎప్పుడూ పోల్చకండి. ప్రత్యేకించి, పిల్లలను వారి బ్రదర్స్ లేదా సిస్టర్స్‌తో పోల్చవద్దు. ఎందుకంటే ఇది తోబుట్టువులలో ప్రతికూల భావాలను సృష్టించి వారి బంధాన్ని నాశనం చేస్తుంది.
తిట్టడం వద్దు:చిన్నపిల్లలు చేసే ప్రతి తప్పును తల్లిదండ్రులు భూతద్దంలో పెట్టి చూస్తారు. దాంతో చీటికిమాటికి పిల్లలను కోపగించుకుంటూ వాళ్లని తిడతారు. దీంతో పిల్లలు తల్లిదండ్రులపై లోలోపల కోపం పెంచుకుంటారు. ఇలా చేయడం వల్ల.. వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, పిల్లలను ఎప్పుడూ తిట్టకూడదు.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పేరెంట్స్ అడగాల్సిన ప్రశ్నలివే! ఎందుకో తెలుసా?