తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 2:18 PM IST

ETV Bharat / sukhibhava

మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? ఇలాగైతే భవిష్యత్తు నాశనమే!

Parenting Tips : పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. వారిపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు. అయితే.. తెలియక వారు చేసే పొరపాట్లే.. పిల్లల జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయట. మరి.. తల్లిదండ్రులు చేసే ఆ పొరపాట్లు ఏంటి..? మీరు ఎలాంటి పద్ధతిని అనుసరిస్తున్నారు?

Parenting Tips
Parenting Tips

Parenting Tips : పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. కానీ, చాలా మంది తల్లిదండ్రులు అవగాహనాలోపంతో.. చిన్నారుల ఫ్యూచర్​ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని అంటున్నారు మానసిక నిపుణులు. అతి గారాబం చేయడం, అతిగా ప్రేమ చూపించడం వంటి చర్యలతో.. మానసికంగా బలహీనంగా మార్చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పేరెంటింగ్‌ స్టైల్‌ను.. "ఎగ్‌ షెల్‌ పేరెంటింగ్‌" అని అంటారు. మీరు కూడా ఈ స్టైల్‌ను ఫాలో అవుతుంటే.. ఈ క్షణం నుంచే మార్చుకోవాలని సూచిస్తున్నారు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడూ చూద్దాం.

Basic Parenting Skills :ఎగ్ షెల్ పేరెంటింగ్ అంటే?
గుడ్డు లోపల ఉన్న పదార్థానికి.. పైన ఉన్న పెంకు (షెల్) రక్షణగా ఉంటుంది. దాంతో.. లోపల ఉన్న పదార్థానికి చింత ఉండదు. ఇదేవిధంగా.. తల్లిదండ్రులు అన్ని విషయాల్లోనూ "అతి" చేసినప్పుడు.. మనకు కావాల్సింది చేయడానికి తల్లిదండ్రులు ఉన్నారులే అనే భావనలోకి పిల్లలు వెళ్లిపోతారట. ఇలాంటి "ఎగ్ షెల్ పేరెంటిగ్ స్టైల్‌" ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలు కొంత వయసుకు వచ్చే వరకు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే. అలా చేయాల్సిందే. కానీ.. పూర్తిగా ప్రతి విషయానికీ తల్లిదండ్రులపైనే పిల్లలు ఆధారపడేలా తయారు చేయడం మంచిది కాదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల.. ఏది మంచి, ఏది చెడు అనేది పిల్లలు తెలుసుకోలేకపోతున్నారని.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది అర్థంకాక తమపై తామే నమ్మకం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచే అన్ని విషయాలనూ నేర్చుకోవాలని, ఇది జరగాలంటే.. వారు సమాజాన్ని తమదైన శైలిలో బాగా పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వారు నలుగురిలో కలవడం అనేది అత్యంత ప్రధానమైనదని చెబుతున్నారు. అప్పుడే.. ఇతరులతో ఎలా కలిసిపోవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా జీవించాలి? అనే విషయాలపై ఓ అవగాహన పెరుగుతూ వస్తుందని అంటున్నారు.

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?-అయితే మీకు IQ ఎక్కువ ఉన్నట్లే!

పోలిక వద్దు..
తల్లిదండ్రులు వారి పిల్లలను ఎప్పుడూ ఇతరులతో పోల్చవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు వారిని వారు తక్కువగా అంచనా వేసుకుంటారని, ఇది మంచిది కాదని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లలు చేసిన చిన్న పనులకు వారిలో ఆత్మవిశ్వాసం కలిగేలా చేయాలని సూచిస్తున్నారు. పిల్లలు ఏదైనా చేయాలని అని అనుకుంటే.. తల్లిందండ్రులు వారిని ప్రొత్సహించాలి కానీ, నిరుత్సాహ పరచకూడదని అంటున్నారు.

అతి గారాబం..
కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు అడిగింది కాదనకుండా కొనిస్తారు. ఇది కూడా మంచిది కాదని అంటున్నారు. వారి వయస్సుకు తగిన వాటిని అందించాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు అవసరం లేనివాటిని ఇవ్వకూడదని.. అది ఎందుకు ఇవ్వట్లేదో కూడా అర్థమయ్యేలా చెప్పాలని సూచిస్తున్నారు. అలా కాకుండా.. అడిగిన ప్రతిదీ చేతిలో పెడితే.. భవిష్యత్తులో పిల్లలు వారు కోరుకున్నది జరగకపోతే మొండిగా తయారవుతారని, అప్పుడు ఎవ్వరి మాటా వినని స్థాయికి చేరుకుంటారని హెచ్చరిస్తున్నారు.

కొట్టడం వద్దు..
తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం, తిట్టడం చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, మీరు వారిని కొడతారనే భయంతో వారు నిజాలను మీ దగ్గర దాచే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. దీని వల్ల పిల్లలు తల్లిదండ్రుల మధ్య మంచి బంధం ఏర్పడదని చెబుతున్నారు. అందుకే వారు చేసిన తప్పులు రిపీట్ చేయకుండా.. ప్రేమతో అప్యాయంగా తెలియజేయాలని సూచిస్తున్నారు.

బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్​లా కరిగిపోతుంది!

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

ABOUT THE AUTHOR

...view details