తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చాపకింద నీరులా పక్షవాతం.. ముప్పుపై బాధితులకు అవగాహన తక్కువే!

పక్షవాతం గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదు. పక్షవాతం బారిన పడుతున్న వారిలో మూడింట రెండొంతుల మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటి ముప్పు కారకాల గురించి తెలియనే తెలియదని స్విట్జర్లాండ్‌ అధ్యయనంలో బయట పడింది.

paralysis-diagnosis
paralysis-diagnosis

By

Published : Dec 1, 2022, 11:02 AM IST

పక్షవాతం చాపకింద నీరులా దాడి చేస్తుంది. చెట్టంత మనిషిని ఉన్నట్టుండి కుప్ప కూల్చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలోనూ దీనిపై ఇప్పటికీ పెద్దగా అవగాహన ఉండటం లేదు. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటం మూలంగా తలెత్తే పక్షవాతం బారిన పడుతున్న వారిలో మూడింట రెండొంతుల మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటి ముప్పు కారకాల గురించి తెలియనే తెలియదని స్విట్జర్లాండ్‌ అధ్యయనంలో బయట పడటమే దీనికి నిదర్శనం.

పక్షవాతం బారినపడ్డ వారి ఆరోగ్య వివరాలు పరిశీలించగా.. వీరిలో అప్పటికే 61% మందికి రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు.. 23% మందికి రక్తపోటు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. మరో 10% మందికి గుండె వేగంగా కొట్టుకోవటం, సుమారు 5% మందికి మధుమేహం ఉన్నట్టూ బయటపడింది. ఇలాంటి సమస్యలను వీరిలో అంతకుముందెన్నడూ గుర్తించకపోవటం గమనార్హం. పక్షవాత నివారణంలో అధిక రక్తపోటుతో పాటు రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను పరీక్షించి, అవసరమైతే చికిత్స చేయటం చాలా ముఖ్యమనే విషయాన్ని అధ్యయన ఫలితాలు నొక్కి చెబుతు న్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details