తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మూత్రాన్ని ఆపుకోలేకపోతున్నారా? సమస్య ఇదే..!

కొందరు పిల్లలు మూత్రాన్ని ఆపుకోలేకపోతుంటారు. తరచూ బాత్​రూమ్​కు వెళ్లినా మూత్రకోశాన్ని(Overactive Bladder) పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం, మూత్ర పిండాలలో సమస్యలు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సమస్యలకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

overactive bladder
మూత్రాన్ని ఆపుకోలేకపోవడం

By

Published : Sep 8, 2021, 9:17 AM IST

మూత్రానికి వెళ్తావా? అని తల్లిదండ్రులు అడిగినప్పుడు.. అవసరం లేదని చెప్పిన పిల్లలే పది నిమిషాలు గడవక ముందే వెళ్తానని చెప్పవచ్చు. అలా చెప్పాక 5 లేదా 6 నిమిషాలు కూడా ఆగలేకపోవడం మూత్రకోశపు అతి చురుకుదనానికి(Overactive Bladder) నిదర్శనం. మూత్రానికి వెళ్లినా మూత్రకోశాన్ని పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం, మూత్ర పిండాలలో సమస్య, మూత్ర నాళాల ఇన్​ఫెక్షన్ లాంటి సమస్యలు చిన్నపిల్లల్లో ఈ పరిస్థితికి దారి తీస్తాయి.

పిల్లలు మామూలుగా మూడేళ్ల వరకు పక్క తడుపుతూ ఉంటారు. చాలా మంది మూడేళ్లు నిండగానే మూత్రాన్ని అదుపు చేసుకోవడానికి అలవాటు పడతారు. కొంతమందిలో ఐదారేళ్ల దాకా కూడా ఈ సమస్య కొనసాగవచ్చు. ఐదేళ్లకే 90 శాతం మంది పిల్లలకు మూత్రం మీద అదుపు వస్తుంది. అయితే.. పగటిపూట కూడా అదుపు కోల్పోవడమన్నది మూత్రకోశపు అతి చురుకుదనం అనే సమస్యకు కారణమని తెలుసుకోవాలి. తరచూ బాత్​రూమ్​కు వెళ్లాలనిపించడం దీని ప్రధాన లక్షణం.

రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు మూత్రానికి వెళ్లడం సహజం. కానీ, మూత్రకోశం(Overactive Bladder Causes) నిండకపోయినా.. మూత్రానికి వెళ్లాలనిపించడం ఈ వ్యాధి లక్షణం. తరచూ మూత్రనాళానికి ఇన్​ఫెక్షన్ సోకడం కూడా ఈ సమస్యకు కారణం. ఒక్కోసారి తుమ్మినప్పుడు అప్రయత్నంగానే నిక్కరు తడిసిపోవచ్చు. ఏడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లల్లో ఈ సమస్య ఉంటే వారు డాక్టర్​ను సంప్రదించడం మేలు.

ప్రధానంగా బ్లాడర్​ కెపాసిటీ కారణంగా మూత్రం ఆపుకోలేకపోవడం సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఓ నిపుణుడు తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు డాక్టర్​ను సంప్రదించి.. పలు టెస్టులు చేయుంచుకుంటే మంచిదని సూచించారు.

ఇదీ చదవండి:

పురుషాంగ పరిమాణం పెరగాలంటే ఏం చేయాలి?

Health tips: నరాల సమస్య.. అశ్రద్ధ చేస్తున్నారా?

ABOUT THE AUTHOR

...view details