తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పొగ తాగుతున్నారా..? అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే..!

ప్రస్తుత కాలంలో పిల్లలు పుట్టక చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అయితే మారుతున్న జీవన విధానానికి తోడు, ఆహారం, అలవాట్లు కూడా సంతానం కలగకపోవడానికి కారణమవుతున్నాయి. అతిగా వ్యాయామం చేయడం వల్ల పిల్లలు పుట్టరా? పొగ తాగడం వల్ల సంతానం కలగదా? బాలింతలు సెక్స్​లో పాల్గొంటే బిడ్డకు తగినన్ని పాలు పడవా? అనే సందేహాలకు నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం.

over exercise effects
పిల్లలు పుట్టకపోవడానకి గల కారణాలు

By

Published : Feb 28, 2023, 11:07 AM IST

Updated : Feb 28, 2023, 11:41 AM IST

మారుతున్న జీవన విధానానికి తోడు ఆహారం, అలవాట్లు మనలో సంతాన సాఫల్యం మీద ప్రభవాన్ని చూపిస్తున్నాయి. ఈ మధ్యన సంతానం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండటమే దీనికి సాక్ష్యం. అయితే పొగతాగే అలవాటు ఉన్న వారికి, ఎక్కువగా వ్యాయామం చేసే అలవాటు ఉన్న వారిలో సంతాన సాఫల్యం ప్రభావితం అవుతుందా? అనే అనుమానాలకు నిపుణుల మాటను తెలుసుకోండి.

అధిక వ్యాయామం వల్ల పిల్లలు పుట్టరా?
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అయితే మహిళలు అతిగా వ్యాయామం చేయడం వల్ల తిప్పలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మహిళలు అతిగా వ్యాయామం చేయడం వల్ల సంతానం విషయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 'అతిగా వ్యాయామం చేసే మహిళల్లో పురుషుల సెక్స్ హార్మోన్స్​ టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి. దీంతో మహిళల్లో అండోత్పత్తి తగ్గుతుంది. అందువల్ల మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువ. అధిక వ్యాయామం మహిళలు చేయకూడదు. అలా చేస్తే హార్మోన్లు బ్యాలెన్స్ తప్పి సంతానం కలిగే అవకాశం తగ్గుతాయి.' అని నిపుణులు అంటున్నారు.

పొగ తాగడం వల్ల పిల్లలు పుట్టరా?
ప్రస్తుత కాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా పొగ తాగుతున్నారు. అయితే పొగ తాగేవారికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువని చెబుతున్నారు నిపుణులు. 'చుట్ట, బీడీ, సిగరెట్​ ఇలా ఏ రూపంలోనైనా పొగ తాగే అలవాటు ఉన్నాసరే పిల్లలు పుట్టే అవకాశం తక్కువే. ఎందుకంటే పొగతాగే వారి శరీరంలోకి నికోటిన్ చేరుతుంది. నికోటిన్​.. మగవారి వీర్య కణాలకు దెబ్బతిస్తుంది. అలాగే మహిళల్లో అండం విడుదలను అడ్డుకుంటుంది.' అని నిపుణులు చెబుతున్నారు.

బాలింతలు శృంగారంలో పాల్గొంటే పాలు తగ్గుతాయా?
బాలింతలు శృంగారంలో పాల్గొంటే చనుపాలు తగ్గుతాయనే అపోహ కొందరిలో ఉంటుంది. ఇదంతా నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. బాలింత సెక్స్​లో పాల్గొనడానికి, చనుపాలకు సంబంధం లేదని అంటున్నారు. 'కాన్పు అయిన ఆరో వారం నుంచి సెక్స్​లో బాలింత పాల్గొనవచ్చు. కానీ గర్భం రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వెంటనే గర్భం వస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి.' అని నిపుణులు చెబుతున్నారు.

చిన్న ఆపరేషన్ జరిగిన ఎంత కాలం తర్వాత సెక్స్​లో పాల్గొనవచ్చు?
చిన్న ఆపరేషన్​(డీ&సీ) చేసుకున్న తర్వాత ఎప్పటి నుంచి శృంగారంలో పాల్గొనవచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే చిన్న ఆపరేషన్ జరిగిన వారం రోజుల తర్వాత నుంచి శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి అభ్యంతరం లేకుండా భాగస్వామి రతీలో పాల్గొవచ్చని నిపుణులు అంటున్నారు.

అధిక వ్యాయామం చేస్తున్నారా? పొగ తాగుతున్నారా? అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే
Last Updated : Feb 28, 2023, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details