ఉల్లి కోస్తున్నప్పుడు మనల్ని ఏడ్పించినా..అది కలిగించే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. చాలా తక్కువ ధరతో దొరుకుతుంది. మెండుగా పోషక విలువలతో నిండి ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేయడంలో ఉల్లి దానికదే సాటి. కూరగాయల్లో దేనికి కూడా దీనిలో ఉన్న పోషక విలువలుండవు అనటంలో సందేహం లేదనే చెప్పాలి.
ఉల్లిలో ఉండే పోషకాలు
- ఐరన్
- సల్ఫర్
- రాగి
- ఫైబర్
- పొటాషియం
- విటమిన్ బి, సిలు సమృద్ధిగా ఉంటాయి
ఉల్లి ప్రయోజనాలు:
- శరీరంలో ముఖ్య భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది.
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంది.
- మనలోని శక్తి సామర్థ్యాలు మెరుగుపరిచి కణాల వృద్ధికి దోహదపడుతుంది.
- పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది.
- రక్తహీనతతో బాధపడేవారికి ఉల్లి ఎంతో మంచిది.
- శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు ఉల్లి చక్కగా ఉపయోగపడుతుంది.
- ఉల్లిలో ఉండే రిడక్టేజ్ అనే ఎంజైమ్ కొవ్వు ఉత్పత్తిని నియంత్రించేందుకు దోహదం చేస్తోంది
- గుండెకు సంబంధించిన వ్యాధులు, గుండె పోటు రాకుండా తక్కువ స్థాయి కొవ్వుతో శరీరాన్ని నియంత్రిస్తుంది.
- శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రోత్సహిస్తుంది(దీని వల్ల అధిక రక్తపోటు స్థాయిని ప్రభావితం చేస్తుంది).
- దంత సంబంధ క్రిములను నాశనం చేస్తుంది.
- ఉల్లిలో ఉండే కాల్షియం ఎముకలలో సాంద్రత పెంచుతుంది.
- మెదడుకు ఒత్తిడి తగ్గిస్తుంది.
- ఉల్లిపాయ నిద్రలేమి సమస్యలను నయం చేయటంలో ఎంతో ఉపయోగపడుతుంది.
- పైల్స్ నివారణకు ఎంతో ఉపయోగపడుతుంది.
పళ్లకు ఎంతో ఉపయోగకరం
దంతక్షయాన్ని, దంత సమస్యలను నివారించడంలో ఉల్లిపాయ మేటి. పచ్చి ఉల్లిపాయ ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిముషాలు నమలడం వల్ల నోటిలో ఉన్న హానికర క్రిములన్నీ నశిస్తాయి. పంటినొప్పితో బాధపడే వాళ్లకు ఇదొక దివ్యౌషధమనే చెప్పాలి. ఆ పంటి కింద చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.
క్యాన్సర్ నివారణ:
ఉల్లిపాయలు క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డగించేందుకు ఉల్లిపాయ ఎంతో తోడ్పడుతుంది. రోజుకో ఉల్లిపాయ తిని ఇటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
పొట్ట నొప్పి నుంచి ఉపశమనం:
ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉల్లిని తినడం వల్ల స్టమక్ అప్ సెట్ నుంచి ఉపశమనం పొందవచ్చు. మనల్ని అత్యంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్యాస్ట్రో సిండ్రోమ్ సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రుతుక్రమం సరిగ్గా రావడానికి
ఈ మధ్యకాలంలో ఇర్రెగులర్ పీరియడ్స్, పీసీఓడి అనేది ప్రతి పది మంది మహిళల్లో 5 మందికి ఉంటుంది. ఆడవారికి సరైన రుతుక్రమం అనేది ఎంతో ముఖ్యం. రెగ్యులర్ పీరియడ్స్ రావాలంటే ఉల్లిపాయ రసంలో బెల్లం కలుపుకొని జ్యూస్‌లా తయారు చేసి తాగాలి. దీనికోసం ఎన్నో మార్గాలున్నప్పటికీ ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.
కాలిన గాయాలను నయం చేస్తుంది:
కాలిన చిన్న చిన్న గాయలను నివారించడానికి ఇది ఒక మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. కాలిన ప్రదేశంలో ఉల్లిపాయ రసాన్ని అప్లై చేస్తే అది చర్మాని చల్లబరుస్తుంది. బొబ్బలు రాకుండా నిరోధిస్తుంది. కాలిపోయిన చర్మానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా నిరోధిస్తుంది.
కిడ్నీలలో రాళ్లను కరిగించడంలో..
నేటి కాలంలో కిడ్నీలలో రాళ్లు అనే సమస్యను తరచుగా వింటుంటాం. ఆ సమస్య నుంచి బయటపడాలంటే చాలానే కష్టపడాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యను తగ్గించడంలో ఉల్లి ఎంతో ఉపయోగపడుతుంది. తరిగిన ఉల్లిపాయను పెరుగులో కలిపి ప్రతిరోజు తింటుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
చర్మ, శిరోజాలకు ఎంతో ఉపయోగకరం..
- తెల్ల ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- ఆలివ్ ఆయిల్, తెల్ల ఉల్లి రసాన్ని కలిపి వాడితే మరింత మంచిది.
- ఉల్లితో చేసిన హెయిర్ ఆయిల్లు కురులకు ఎంతో ఆరోగ్యకరం
- ఉల్లి గుజ్జును ముఖానికి పట్టించడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
- రోజూ ఒక పచ్చి ఉల్లిపాయను తింటే అధిక కొవ్వును చాలా సులభంగా తగ్గించవచ్చు.
పొట్టనిండా విటమిన్లు నింపుకున్న ఉల్లిపాయను పచ్చిగా తిన్న, వంటల్లో వాడుకున్నా, క్రమం తప్పకుండా తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఉల్లి విలువను గుర్తించి ప్రతిరోజూ వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఇవీ చదవండి: