పిల్లల ఎదుగుదలకు సమతుల ఆహారం (Nutrition Food for kids) చాలా అవసరం. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, విటమిన్లు, ప్రోటీన్లు తక్కువగా తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. తల్లిపాలు మానేసిన తర్వాత పిల్లలకు ఇచ్చే ఆహారంపై అవగాహన ఉండాలి. మంచి శక్తి వచ్చే ఆహారాన్ని (Nutrition Food) తయారు చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినటం అలవాటు చేయాలి. నూనె పదార్థాలు అలవాటు చేయకూడదు. పీచు పదార్థాలు, సీజన్లో లభించే ఆహారపదార్థాలు తినిపించాలి.
- రుచి కన్నా ఆరోగ్యానికి ఏది అవసరమో అది తినేలా అలవాటు చేయాలి.
- ఇంట్లో ఎప్పుడూ పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి
- తృణధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలి.
- బడికేళ్లేటప్పుడు ఇచ్చే స్నాక్స్ కూడా పోషణనిచ్చేవిగా ఉండాలి.
- పచ్చి కూరగాయలు పిల్లలకు పెట్టకూడదు. మంచిగా వండిన ఆహారాన్నే ఇవ్వాలి.
- దుకాణాల్లో కొనుగోలు చేసే చిప్స్, సోడాను పిల్లలకు ఇవ్వకూడదు. ఇంట్లోనే తయారు చేసి చిరుతిళ్లు ఇవ్వాలి.
- పాల పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. అలాగే కొవ్వు అధికంగా లేకుండా చూసుకోవాలి.
- పంచదార అధికంగా ఇవ్వకూడదు. చిన్నవయసులోనే ఊబకాయం రాకుండా ఉంటుంది.
- మాంసాహారులైతే స్కిన్లెస్ మాంసాన్నే ఇవ్వడం మంచిది.
- పోషక విలువలు అధికంగా ఉండే పప్పుధాన్యాలను రోజూవారి ఆహారంలో వాడితే పిల్లల ఎదుగుదల బాగుంటుంది.
- పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
- శీతలపానియాలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వాటిలోని చక్కెర శాతం, రసాయనాలు అనారోగ్యాన్ని కల్గిస్తాయి.
- పిల్లలు కూరగాయలు తినకుండా మారాం చేసినప్పుడు వాటినే చిరుతిళ్లుగా చేసి ఇవ్వటం మంచిది.
- రోజూ ఒక గుడ్డు, పాలు ఇవ్వడం మంచి పోషక విలువల్ని ఇస్తుంది.