తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఇది మీకోసమే! - meditation for asthma

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో ఆస్తమా ఒకటి. దీనికి గురైన వారు శ్వాసనాళాలు కుచించుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆయాసం, దగ్గు, ఛాతి బరువుగా అనిపించడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆస్తమా ఉన్నవారు వైద్యులు సూచించినట్లుగా క్రమం తప్పకుండా మందులను వాడుతూ ఉండాలి. అయితే మందులతోనే కాకుండా ఆస్తమాను సహజంగా తగ్గించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

natural ways to reduce Asthma Symptoms
ఆస్తమాను తగ్గించుకునే మార్గాలు

By

Published : Feb 4, 2023, 1:06 PM IST

ఆస్తమాను తగ్గించుకునే మార్గాలు

ఆస్తమాతో బాధపడుతున్నవారు కొన్నిరకాల సహజమైన పద్ధతులతో అదుపులో ఉంచుకోవచ్చు. దగ్గు, ఆయాసం ఉన్నవారు ఇన్​హేలర్​ ద్వారా ఉపశమనం పొందుతుంటారు. అయితే సహజ పద్ధతుల ద్వారా కూడా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. మరి వైద్యులు ఇచ్చిన సలహాలు, సూచనలు మీకోసం..

నివారణ మార్గాలు..

  • యోగ, ధ్యానం వంటివి చేయడం ఎంతో మంచిది.
  • ఆహారంలో రంగురంగుల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాంటి వాటిలో బీ, సీ విటమిన్​లు బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, మంట లక్షణాలను నిరోధిస్తాయి. అయితే ఆహార పదార్ధాలను నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్​లను వాడుతారు. అవి ఆస్తమాను మరింత పెంచుతాయని మరువకూడదు.
  • వేడి నీటి స్నానం ద్వారా కూడా ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కొంతమందికి ఆవిరి వేడి వలన ఆస్తమా లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
  • అల్లం వెల్లులికి కూడా ఆస్తమా లక్షణాలను తగ్గించే శక్తి ఉంది. వేడి నీటిలో అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మరిగించి చల్లారాకా టీలా తాగాలి.
  • కెఫిన్ ఉన్న పానీయం చాలా మేలు చేస్తుంది (4 గంటల వరకు ఊపిరితిత్తుల పనితీరును ఈ పానీయం మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి)
  • ఆస్తమా ఉన్నవారిలో చాలా మందికి అలర్జీలు ఉంటాయి. తమలో అలర్జీని పెంచుతున్న అంశాలేమిటో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. పుప్పడి, దుమ్ములోని సూక్ష్మక్రిములు, పెంపుడు జంతువుల చుండ్రు వంటివి చాలా మందిలో అలర్జీని ఆస్తమాను పెంచుతుంటాయి.

పాటించాల్సిన ఆహారపు అలవాట్లు..

  • అధిక కారం, మసాలాలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తినాలి.
  • రాత్తి భోజనం చేశాక పడుకునే ముందు ఒక గంట గ్యాప్ ఉండేలా చూసుకుంటే ఆస్తమాను అదుపులో పెట్టుకోవచ్చు.
  • వేడి వాతావరణంలో వేడి పదార్థాలను మాత్రమే తినాలి.
  • పాలు, గుడ్లు, చేపలు ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి.
  • శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి.

చేయాల్సిన వ్యాయామాలు..

ABOUT THE AUTHOR

...view details