తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మహిళల్లో లైంగిక కోరికను పెంచే 5 సహజ పద్ధతులు! అవేంటో తెలుసా? - మహిళల్లో సెక్స్ కోరికలు పెంచడం ఎలా

Natural Viagra Alternatives For Women : మనసుకు, శరీరానికి ఏకకాలంలో అన్​లిమిటెడ్​ రిలాక్సేషన్​ ఇచ్చే.. సాధనం సెక్స్. దాన్ని మనసారా ఆస్వాదిస్తే.. ఎన్నో సమస్యలకు చెక్ పడుతుంది. కానీ.. మహిళల్లో చాలా మందికి మూడు పదుల వయసు దాటకుండానే.. శృంగారంపై ఆసక్తి తగ్గిపోతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. అయితే.. కోరికల బండిని తిరిగి పట్టాలెక్కించవచ్చా? అన్నప్పుడు 5 నేచురల్ మెథడ్స్ సూచిస్తున్నారు నిపుణులు.

5 Natural Viagra Alternatives For Women
Viagra Alternatives For Women

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 2:44 PM IST

5 Natural Viagra Alternatives For Women :మహిళల్లో వివాహమైన తొలినాళ్లలో శృంగారంపై ఉన్నంత ఆసక్తి.. ఆ తరవాత కాలంలో తగ్గుతూ వస్తుంది. దీనికి కారణాలు అనేకం. పిల్లలు ఎదుగుతుండడం, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థికం, ఆరోగ్యం.. వంటి సమస్యలెన్నో ఉంటాయి. దీంతో.. క్రమంగా మహిళలు పడక సుఖానికి దూరమైపోతుంటారు. అయితే.. శృంగారానికి దూరమవడం వల్ల మనసుకు సరైన "రిలాక్సేషన్" లభించక.. అది మరికొన్ని సమస్యలకు దారితీయవచ్చు. అందుకే.. సంసారం జీవితంలో శృంగార పాత్ర ఎంతో కీలకం అంటారు నిపుణులు. అయితే.. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా.. తిరిగి లైంగిక ఆసక్తిని పెరిగేలా చేయొచ్చని చెబుతున్నారు.

1. ఆయుర్వేదం :మహిళల్లో లైంగిక ఆసక్తిని పెంచడానికి ముఖ్యంగా రెండు ఆయుర్వేద మూలికలు దివ్య ఔషధంగా పని చేస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి అశ్వగంధ, శతావరి. శతావరి మహిళల్లో సంతానోత్పత్తికి, లైంగిక ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది. శతావరి వేర్లు డయాబెటిస్‌ వ్యాధిని తగ్గించడంలోనూ సహయపడతాయి. ఇది యాంటీ డయాబెటిక్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని పెంచుతుంది. శతావరి మూలికలు మహిళల్లో ఒత్తిడిని తగ్గించే హార్మోన్‌లను విడుదల చేస్తాయని చెబుతున్నారు. అశ్వగంధ సైతం.. లైంగిక కోరికలను పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

2. మకా రూట్ :మకా రూట్ అనేది ఆండీస్ పర్వతాలకు చెందిన మూలికగా చెబుతారు. ఇది ఒక రకమైన క్రూసిఫెరస్ కూరగాయ. క్యారెట్ మాదిరిగా ఇది భూమి లోపల పండుతుంది. దాని రూట్‌ను తింటారు. మహిళల్లో లైంగిక కోరికలను పెంచడంలో మకా రూట్‌ సహాయపడుతుంది. ఇది స్త్రీలలో మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. అలాగే నిరాశ, ఆందోళనలను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. మకా రూట్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Vitamin Benefits Chart : సెక్స్ సామర్థ్యం పెంచే విటమిన్ ఏది? వేటితో ఏం ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

3. చాక్లెట్స్‌ :మహిళల్లో లైంగిక కోరికలను పెంచడానికి డార్క్ చాక్లెట్లు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే అనాండమైడ్, ఫెనిలేథైలమైన్, ఎండార్ఫిన్‌లు, థియోబ్రోమిన్‌ రసాయనాలు నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయని వారు చెబుతున్నారు. కోకోను తినడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుందట.

4. విటెక్స్ :విటెక్స్‌ను చాస్ట్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది మహిళల్లో వచ్చే మెనోపాజ్‌ దశను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో ఈ మూలిక సహాయపడుతుంది. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచడంలో విటెక్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

5.వ్యాయామం :మహిళల్లో లైంగిక ఆసక్తిని పెంచడానికి ప్రతిరోజూ 20 నిమిషాలపాటు ఏదైనా వ్యాయమం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలోని అవయవాలన్నింటికీ రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. క్రమం తప్పకుండా నడక, పరుగు, ఈత, సైక్లింగ్‌, యోగా వంటి వాటిలో ఏదో ఒకటి చేయాలని సూచిస్తున్నారు.

పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఈ 5 టిప్స్​ పాటిస్తే మీకు ఫుల్​ రిలీఫ్​!

Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

ABOUT THE AUTHOR

...view details