Natural Treatment For Diabetes: వయసుతో సంబంధం లేకుండా అందరిపై దాడిచేస్తోంది మధుమేహం. చిన్నా, పెద్దా అందరూ ఈ వ్యాధి బాధితులుగా మారుతున్నారు. అయితే సహజంగా మధుమేహాన్ని నియంత్రించుకోవడమే ఉత్తమం.
సహజ సిద్ధంగా షుగర్‌ను తగ్గించే మార్గాలు ఇవే..
Natural Treatment For Diabetes: ఇటీవలి కాలంలో మధుమేహం బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలామంది అలోపతి, హోమియోపతి అంటూ రకరకాల మందులు వాడుతూ రూ.వేలు, లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి నియంత్రణ కోసం కొన్ని సహజమైన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్
మధుమేహాన్ని సహజంగా తగ్గించుకునే మార్గాలు..
- ఊబకాయం, నియంత్రణ లేని జీవనవిధానం మధుమేహ బాధితులకు రిస్క్‌ను పెంచుతాయి. రెగ్యూలర్‌గా వ్యాయామం చేయడం, బరువును చెక్‌చేసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్‌ను పెరగకుండా నియంత్రించవచ్చు.
- భోజనవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అధిక బరువును నియంత్రణలో పెట్టవచ్చు. పోషకాలతో కూడిన ఫుడ్ మెనూ ఫాలో కావాలి. తృణధాన్యాలు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి కరెక్ట్‌గా ఉంటుంది.
- ధూమపానం అలవాటు ఉంటే మానేయాలి. లేదంటే అది టైప్-2 మధుమేహాన్ని మరింత పెంచడంతోపాటు గుండెపోటుకు దారితీస్తుంది.
- మెడిటేషన్, యోగా క్రమంగా చేయడం ద్వారా ఒత్తిడి, షుగర్ నియంత్రలో ఉంటుంది.
ఇదీ చూడండి:world diabetes day 2021: మధుమేహం యువతనే ఎందుకు టార్గెట్ చేస్తోంది? కారణాలేంటి?