Natural Fruit Face Packs for Glowing Skin :అందంగా కనిపించాలని, ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అందుకోసం ఈ కాలం అమ్మాయిలు.. ఏవేవో క్రీములు, సౌందర్య సాధనాల్ని వాడుతున్నారు. ఇకపోతే మరికొందరు ఫేషియల్స్(Facials)కోసం బ్యూటీ పార్లర్ల బాట పడుతున్నారు. ఎంతో ఖర్చుపెట్టి మరీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు.
Fruit Face Packs for Beautiful Skin :బ్యూటీ పార్లర్లలో వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో, అది కూడా మార్కెట్లో లభించే సహజసిద్ధమైన పండ్ల(Fruits)తో ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవచ్చు. అయితే మాకంత టైం లేదంటారా? అందుకోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే సమయాన్ని ఇంట్లో ఫేషియల్ చేసుకోవడానికి కేటాయిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో వివిధ పండ్లతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..
క్యారెట్ జ్యూస్‌తో..మొదటగా మీరు కొన్ని క్యారెట్లను తీసుకొని జ్యూస్ రెడీ చేసుకోండి. ఆ తర్వాత కొద్ది మొత్తంలో బొప్పాయి రసం సిద్ధం చేసుకోవాలి. ఆ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమానికి కాస్త శనగపిండి, తేనె యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దానిని ఫేస్‌కి అప్లై చేయాలి. అలా అరగంట ఉంచిన తర్వాత.. చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
యాపిల్ పండ్లతో..మీరు ముందుగా ఒక యాపిల్‌ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో తేనె, రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి.. కాసేపు ఆగి కడుక్కోవాలి. ఇలా మీరు తరచూ చేస్తుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును పొందుతుంది.
ఆరెంజ్ తొక్కలతో..ఈ ప్రూట్ ఫేషియల్ కోసం మీరు మొదట కొన్ని ఆరెంజ్ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని స్టోర్ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆ పొడిలో కొద్దిగా గంధం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా మీరు తరచూ చేస్తుంటే చర్మంపై ఉన్న జిడ్డుతనం పోయి యవ్వనంగా తయారవుతారు.