Mutton Side Effects in Telugu: చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కొంత మంది వారానికి ఒకసారి తింటే.. మరికొందరు వారానికి మూడునాలుగు రోజులు లాగిస్తుంటారు. నాన్‌వెజ్ అంటే ముందుగా అందరికీ చికెన్ గుర్తుకువస్తుంది. ఆ తర్వాతి స్థానంలో మటన్ మస్ట్‌గా ఉంటుంది. వాస్తవానికి ఇవి రెండూ ఆరోగ్యానికి అవసరమే. ఎందుకంటే.. మాంసాహారం తినడం వల్ల శరీరానికి ప్రొటీన్స్ లభిస్తాయి. వీటిలోని పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. మాంసం పరిమితంగా తినడం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వ్యాధుల నిలయంగా మారుతుందని అంటున్నారు. మాంసాహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధులతోపాటు షుగర్ కూడా ఎటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ నేచురల్ ప్యాక్స్‌తో కోమలంగా మారిపోతాయి!
మటన్ ఎక్కువగా తినడం వల్ల నష్టాలు:
గుండెపోటు వచ్చే ప్రమాదం:మటన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు ప్రమాదం కలుగుతుంది. మటన్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది LDL (చెడు కొలెస్ట్రాల్) ను పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయులు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా హానికరమైన కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోయి.. రక్త ప్రసరణకు అడ్డంకులు కలిగిస్తుంది. ఫలితంగా.. రక్త సరఫరా తగ్గి గుండెకు సరిపడా ఆక్సిజన్ అందదు. అందుకే.. మాంసం అతిగా తినేవారికి గుండెపోటు, పక్షవాతం లేదా ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మటన్‌ను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.