తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పిల్లలకు అమ్మ ఇచ్చే గొప్ప బహుమతి తల్లి పాలే - benefits of breast milk

అప్పుడే పుట్టిన శిశువు.. కుటుంబంలో తనతోపాటు సంతోషాన్నితెస్తుంది. అయితే తల్లితండ్రులుకు అప్పుడే కొత్త బాధ్యతలు వస్తాయి. పసిబిడ్డలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? వంటి ప్రశ్నలతో తల్లిదండ్రుల్లో ఒకరకమైన ఆత్రుత మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు విజయానంద్​ జమల్​ పూరి పలు సూచనలిచ్చారు.

Mother's milk is the greatest gift a mother can give to children
పిల్లలకు తల్లి అందించే గొప్ప బహుమతి తల్లి పాలే

By

Published : May 24, 2020, 12:08 PM IST

తల్లి పాలు శిశువుకు ప్రత్యేక ఆహారం. బయటదొరికే పాలకు దూరంగా ఉండటం మంచిది. పాలలో నీరు లేదా చక్కెరను కలపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని... వాస్తవానికి ఇది హానికరమని పిల్లలవైద్య నిపుణులు డాక్టర్​ విజయానంద్​ జమల్‌ పూరి చెప్పారు. పుట్టిన పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం ఇవ్వాలి? వంటి అనుమానాలు తొలిగిపోవాలంటే విజయానంద్​ సలహాలు సూచనలు చదవండి.

"పసిపిల్లల కడుపు ఘనపదార్థాలను తీసుకోవడానికి అప్పుడే సిద్ధంగా ఉండదు. కనుక మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. వారి ఆహారం కూడా అదే. తల్లిపాలలో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు తప్పనిసరిగా అందించాలి. అలెర్జీలు, అంటురోగాలు పిల్లల దరి చేరకుండా రక్షించేవి తల్లిపాలే. ఈ ఒక్క ప్రయోజనం మాత్రమే కాదు. తల్లీబిడ్డల మధ్య బంధాన్ని సృష్టిస్తుంది. పుట్టినప్పుడు శిశువుకు తల్లి అందించే గొప్ప బహుమతి తల్లి పాలు. ఇవి శిశువుకు ప్రత్యేకం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది."

-విజయానంద్​ జమల్ ​పూరి, శిశువైద్యుడు

'శిశువు పెరిగేకొద్దీ, బిడ్డకు తల్లి పాలు సరిపోవు. ఆరు నెలల వయసు తర్వాత ఇతర పాల ఉత్పత్తులతో పాటు కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వడం ప్రారంభించాలని జమల్​ అంటున్నారు.

డాక్టర్ విజయానంద్ సూచనలు సలహాలు

  • 6 నెలల తర్వాత శిశువుకు పాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వడం చాలా ముఖ్యం.
  • ఆవు పాలు, గేదె పాలు మధ్య అంత తేడా ఉండదు. వాటిలో ఏదో ఒకటి ఒక ఏడాది వయసు దాటిన శిశువుకు ఇవ్వాలి.
  • పాలను ఘన పదార్థాలతో కలపకూడదు. అయితే సరైన పరిమాణంలో రెండూ ముఖ్యమైనవే.
  • పాలు కాకుండా, పన్నీర్, పెరుగు, నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులను కూడా ఆహారంలో చేర్చాలి.
  • ప్యాకెట్లలో లభించే పాలను కూడా ఇవ్వొచ్చు. అయితే పాలు నేరుగా పాలవాడి నుంచి కొన్నట్లయితే వాటిని ఆహారంగా ఇచ్చే ముందు బాగా వేడిచేయాలి.
  • ఫార్ములా పాలు. వీటిని సాధారణంగా పాలపొడి అని పిలుస్తారు. ఇది అంత ప్రయోజనకరం కాదు. "ఫార్ములా పాలను ఉపయోగించడాన్ని నేను ప్రొత్సహించను." అని డాక్టర్ విజయానంద్ చెప్పారు.
  • ఆరు నెలల తర్వాత శిశువుకు ఫార్ములా పాలను ఇస్తే తల్లి పాలు నెమ్మదిగా తగ్గించండి.
  • ఒకేడాది తర్వాత పిల్లలకు... రోజుకు 300 - 400 మిల్లీలీటర్ల పాలు ఇవ్వాలి.
  • పైన పేర్కొన్న పరిమాణం కంటే కొంచెం తక్కువ లేదా అంతకంటే ఎక్కువ హానికరం కాదు. తల్లిదండ్రులు దీన్ని ఎప్పటికప్పుడు కొలవాల్సిన అవసరం లేదు.
  • పిల్లలకు పాలు రుచి నచ్చకపోతే, రుచి వచ్చేలా కొన్ని పదార్థాలు కలిపి మిల్క్‌షేక్‌ల రూపంలో ఇవ్వడం వంటి ప్రయోగాలు చేయవచ్చు. కానీ, కాల్షియం, ఇతర పోషకాలకు పాలు ముఖ్యమైన వనరు. ఇవి పెరుగుతున్న పిల్లలకి తక్కువ పరిమాణంలో ఇవ్వాలి.
  • పాలు కొంచెం తీయగా ఉంటాయి. కాబట్టి పాలలో చక్కెరను కలపకుండా పిల్లలకు ఇవ్వడం మంచిది.
  • పాలల్లో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి.

ఇదీ చూడండి:పెళ్లి కోసం 80 కిలోమీటర్లు నడిచిన వధువు

ABOUT THE AUTHOR

...view details