Morning Wake Up Headache Reasons :మార్నింగ్ లేవగానే ఫ్రెష్ మైండ్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొందరి విషయంలో ఇది సాధ్యం కాదు. తగినంత నిద్ర పోయినప్పటికీ.. చాలా మందికి ఉదయం లేవగానే తలనొప్పి, చిరాగ్గా అనిపిస్తుంది. ఇక వింటర్లో ఈ సమస్య ఎక్కువ మందిని ఇబ్బందిపెడుతుంది. ఇలా ఉదయం నిద్రలేవగానే తలనొప్పి(Headache) వస్తే అది మన మానసికస్థితిపైనే కాదు.. పని మీదా ప్రభావం చూపుతుంది. మరి.. దీనికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఒత్తిడి :ఉదయం లేవగానే వచ్చే తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒత్తిడిని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. ఒత్తిడి లేదా టెన్షన్ తలనొప్పి అత్యంత సాధారణ రకం. ఇది ఎక్కువగా కండరాల ఒత్తిడి కారణంగా సంభవిస్తుంది. తలకు రెండు వైపులా స్థిరమైన నొప్పిని కలగజేస్తుంది. అలాగే ఒత్తిడి వల్ల భుజాలు, మెడలో కండరాలు బిగుసుకుపోతాయని.. వాటి ఫ్రీక్వెన్సీ క్రమంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మీలో ఈ లక్షణం ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం బెటర్.
మద్యం : ఆల్కహాల్ అనేది ఒక సాధారణ మైగ్రేన్ ట్రిగ్గర్. మద్యం ద్వారా చాలా మందిలో మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఆల్కహాల్‌లో హిస్టామిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను ఎఫెక్ట్ చేస్తుంది. దాంతో అది తలనొప్పికి దారితీస్తుంది. అదేవిధంగా ఆల్కహాల్‌లోని ప్రధాన పదార్థం ఇథనాల్‌కు సైతం మెగ్రేన్ను కలిగించే శక్తి ఉంది. అలాగే.. ఇథనాల్ సాధారణం కంటే ఎక్కువ మూత్ర విసర్జనకు గురయ్యేలా చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్ తలెత్తే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కూడా ఉదయం పూట తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.