Morning Drinks to Decrease Bad Cholesterol Levels:మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్.. ఇవన్నీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌లో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అదే విధంగా, బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త గడ్డకట్టడం, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్, కొవ్వులు, స్వీట్లు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానేస్తే చెడు కొలెస్ట్రాల్ పెరగడం తగ్గుతుంది. అంతే కాకుండా కొన్ని డ్రింక్స్‌ను మార్నింగ్ టైమ్‌లో తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఆ డ్రింక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
గ్రీన్ టీ:బరువు తగ్గాలనుకునేవారిలో చాలామంది గ్రీన్ టీని రెగ్యులర్‌గా తాగుతూ ఉంటారు. ఇది బరువు తగ్గడానికే కాదు.. మన ఆరోగ్యాన్ని రక్షించడానికీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంతేకాదు, గ్రీన్ టీ.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, కాటెచిన్‌లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
టీ తాగేటప్పుడు ఈ స్నాక్స్ తింటున్నారా? - జాగ్రత్త, మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్లే!
పసుపు, బాదంపాలు:యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. అంతే కాకుండా పసుపులోని కర్కుమిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బులను తగ్గించడంలో సాయపడుతుంది. దీనిని ఎలా తీసుకోవాలంటే.. ఓ గ్లాస్ బాదం పాలు తీసుకుని వేడి చేయాలి. తర్వాత 1/2 టీస్పూన్ పసుపు పొడి, నల్ల మిరియాల పొడి 1/4 టీస్పూన్ వేసి కొద్దిసేపు మరిగించిన తర్వాత తాగాలి. రుచి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు..
బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్:బీట్‌రూట్, క్యారెట్‌లలో యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతంగా సహాయపడతాయి. దీనిని ఎలా తీసుకోవాలంటే.. ఒక బీట్‌రూట్, రెండు క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి.. మిక్సీ జార్లో వేసి ఓ చిన్న అల్లం ముక్క, ఓ గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఆ రసాన్ని గ్లాస్‌లోకి తీసుకుని తాగవచ్చు. అలాకాదంటే వడపోసి కూడా తాగొచ్చు..