తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బాణపొట్ట ఎబ్బెట్టుగా ఉందా? ఉదయాన్నే ఇలా చేస్తే చాలు - ఐస్​లా కరిగిపోతుంది! - బెల్లీ ఫ్యాట్​ తగ్గించడానికి టిప్స్​

Belly Fat Reduced Tips : బె​ల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడం చాలా మంది కల. కానీ, ఇది అంత త్వరగా అవ్వదు అని అనుకుంటారు చాలా మంది. కానీ, న్యూట్రిషనిస్టుల చెప్పిన కొన్ని టిప్స్‌తో సమస్యని ఈజీగా తగ్గించుకోవచ్చు. అది ఎలానో ఈ కథనంలో చూద్దాం..

Belly Fat Reduced Tips
Belly Fat Reduced Tips

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 4:32 PM IST

Morning Activities to Reduced Belly Fat in Telugu: ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో భారీగా బరువు పెరుగుతున్నారు. మూడు పదుల వయసులోనే.. బాణ పొట్ట వేసుకొని తిరుగుతున్నారు. ఆ తర్వాత.. స్లిమ్‌గా మారేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఇందుకోసం ఎన్నో పనులు చేసి, ఫలితం లేక నీరసించిపోతున్నారు. అయితే.. ఈ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా.. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు.

అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. మీరు ఇప్పుడున్నంత బరువు ఒక్కరోజులోనే పెరగలేదు. ఇదేవిధంగా.. బరువు తగ్గడం అన్నది కూడా రాత్రికి రాత్రే జరిగే పనికాదు. ఈ వాస్తవాన్ని గుర్తించి.. ప్రణాళికబద్ధంగా, స్థిరంగా ఆచరించవలసిన కొన్ని అంశాలు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర్నించీ మీరు అనుసరించే దినచర్య సరిగ్గా ఉండాలి. దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ యాక్టివిటీస్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

ముఖంలో అప్పుడే వృద్ధాప్య ఛాయలా? అర్జెంటుగా ఇవి తినడం స్టార్ట్ చేయండి - నిగనిగలాడిపోద్ది!

  • నిమ్మకాయ-తేనె:ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మ కాయ రసం, స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ మార్నింగ్ డ్రింక్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • అల్పాహారానికి ముందు వ్యాయామం:మీరు ఉదయం బ్రేక్​ఫాస్ట్​కు ముందు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించే వ్యాయామాలు చేయండి. ఇది మీ జీవ క్రియలను యాక్టివేట్ చేస్తుంది.
  • ధ్యానం:రోజువారీ కార్యకలాపాలతో ఒత్తిడికి గురైన మనస్సును కూల్ చేయడానికి.. ధ్యానం గొప్ప మార్గం. మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం వ్యాయామం చేసిన తర్వాత, 15-20 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగే కనీసం రోజుకి 30 నిమిషాలు మీకు ఒత్తిడిని తగ్గించి.. ప్రశాంతత కలిగించే ఏ పనినైనా చేయండి. డాన్స్ చేయడం.. పాటలు వినడం.. పుస్తకం చదవడం వంటివి చేయాలి.

భోజనంలో ఈ మార్పులు చేయండి.. షుగర్‌ మీరు చెప్పినట్టు వినాల్సిందే!

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇవి మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రొటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.

  • విటమిన్ డి:విటమిన్ డి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయం పూట మీ శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోండి. ముఖ్యంగా, కొద్దిగా ఎండ వచ్చిన తరువాత వాకింగ్ చేస్తే, ఇటు వాకింగ్ ప్రయోజనాలు, అటు ఎండ నుంచి విటమిన్ డి లభిస్తాయి. దీనివల్ల మీకు విటమిన్ "డి" సహజసిద్ధంగానే అందినట్టు అవుతుంది. ఈ పనులు సక్రమంగా చేస్తే.. తప్పకుండా బాణపొట్ట కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!

బ్లాక్​హెడ్స్​తో ఇబ్బంది పడుతున్నారా?- ఈ టిప్స్​ ఫాలో అయ్యి మీ సమస్యకు స్వస్తి పలకండి!

ABOUT THE AUTHOR

...view details