తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Black fungus: 'మాస్కులు మార్చకపోతే.. ఫంగస్‌ వచ్చే అవకాశం' - black fungus disease

కరోనా కేసుల నుంచి కోలుకున్నవారిని ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున.. అలాంటి వారికి ఈ మ్యూకర్‌ మైకోసిస్‌ ప్రబలుతోంది. కరోనా నుంచే కాదు ఫంగస్‌ల నుంచి కూడా రక్షణ పొందేందుకు ప్రజలు మాస్కుతో పాటు ఇతర నిబంధనలు కచ్చితంగా పాటించాలంటున్న ప్రముఖ శ్వాసకోశ నిపుణులు సుబ్బారావుతో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి..

black fungus, Respiratory specialist subbarao
బ్లాక్‌ ఫంగస్, శ్వాసకోశ నిపుణులు డా. సుబ్బారావు

By

Published : Jun 5, 2021, 2:39 PM IST

మాస్కులు మార్చకపోతే ఫంగస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ: డాక్టర్ సుబ్బారావు

'బ్లాక్‌ఫంగస్‌ సైనసిస్, ఊపిరితిత్తులు, కళ్లు, మెదడుపై ప్రభావం చూపుతుంది. కరోనా నుంచి ఆలస్యంగా కోలుకుంటున్న వారిపైనే ఈ ఫంగస్ ప్రభావం ఉంది. ఆస్పత్రుల్లో హ్యూమిడిఫైయర్‌ బాటిళ్లను తరచుగా మారుస్తుండాలి. బ్లాక్‌ ఫంగస్ చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ పరిశుభ్రమైన మాస్కులనే ధరించాలి.'

సుబ్బారావు, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు, ఎంఎన్ఆర్ వైద్య కళాశాల పల్మనాలజీ విభాగాధిపతి

ఇదీ చదవండి:Covid : కరోనాకు బలవుతున్న తల్లిదండ్రులు.. అనాథలుగా మారుతున్న పిల్లలు

ABOUT THE AUTHOR

...view details