Microwaves Can Cause Cancer? :ఒకప్పుడు వంట చేసుకోవాలంటే కట్టెల పొయ్యి వాడేవారు. కాలక్రమంలో ఎల్పీజీ గ్యాస్ స్టవ్ వచ్చింది. ఆ తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ కూడా వంటింట్లోకి వచ్చేసింది. నేటి బిజీబిజీ లైఫ్లో తక్కువ టైమ్లో వంట సిద్ధం కావాలనే ఉద్దేశంతో చాలా మంది మైక్రోవేవ్ ఓవెన్లు తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే.. కొందరిలో ఓవెన్స్ విషయంలో పలు సందేహలు ఉన్నాయి. మైక్రోవేవ్(Microwave)లో ఆహారాన్ని వండుకోవడం లేదా వేడి చేయడం సురక్షితమేనా? క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అనే భయాలు ఉన్నాయి. మైక్రోవేవ్ ఓవెన్లు క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తాయన్న అనుమానాలే ఈ భయాలకు కారణాలు. మరి.. వాస్తవాలేంటి? అపోహాలు ఏవి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అపోహ : మైక్రోవేవ్లో ఆహారం వండితే లేదా వేడి చేస్తే అందులోని పోషకాలను తొలగిస్తుంది.
వాస్తవం :ఇతర వంట పద్ధతుల కంటే మైక్రోవేవ్లో ఆహారం నిజానికి ఎక్కువ పోషకాలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉడకకుండా ఉన్నంత వరకు వాటిలోని పోషకాలను సంరక్షించడంలో మైక్రోవేవ్ ఓవెన్లు సహాయపడతాయి.
అపోహ :మైక్రోవేవ్ ఓవెన్లు క్యాన్సర్‌కు కారణమవుతాయి.
వాస్తవం : మైక్రోవేవ్ ఓవెన్లు క్యాన్సర్‌కు కారణమవుతాయనే వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి, ఓవెన్లు ఆహారాన్ని వండడానికి, వేడి చేయడానికి సురక్షితమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. మైక్రోవేవ్ ఓవెన్లు మానవులకు హాని కలిగించే రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవని WHO పరిశోధనలో తేలింది. ఇంకా.. ఇందులో ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే తరంగాలు.. ఆహారం పరమాణు నిర్మాణంలో ఎటువంటి ముఖ్యమైన మార్పులనూ కలిగించలేనంత బలహీనంగా ఉంటాయని తెలిపింది.
అపోహ : మైక్రోవేవ్ ప్లాస్టిక్ కంటైనర్లు క్యాన్సర్ కారక రసాయనాలను విడుదల చేస్తాయి.