తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అశ్వగంధతో కరోనాకు ఔషధం!

అశ్వగంధకు కరోనా వైరస్ పోరాడే శక్తి ఉందని దిల్లీ ఐఐటీ, జపాన్​కు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్​డ్​ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, కొవిడ్​-19 రోగులు కోలుకునేలా చేస్తుందని.. ఈ పరిశోధక బృందం భావిస్తోంది.

Medicine for corona with ashwagandha
అశ్వగంధతో కరోనాకు ఔషధం

By

Published : May 19, 2020, 10:18 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడికి కొవిడ్​-19ని నిరోధించే ఔషధ లక్షణాలు ఉన్నట్లు దిల్లీ ఐఐటీ, జపాన్​కు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్​డ్​ ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ సంయుక్త అధ్యయనంలో తేలింది. సంబంధిత పరిశోధన పత్రాన్ని జర్నల్ ఆఫ్​ బయోమాలిక్యులర్​ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్​లో ప్రచురణకు అనుమతి లభించినట్లు దిల్లీ ఐఐటీ తెలిపింది. వైరస్ వ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తున్న ప్రధాన ప్రొటీన్లను విభజించడానికి ఉపయోగపడే ఎస్​-2 ఎంజైమ్​ను లక్ష్యంగా చేసుకొని ఈ పరిశోధనలు చేశారు.

అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్​ యాసిడ్ పెంథాల్​ ఈస్ట్ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్​తో పోరాడే శక్తి ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. ఈ ఔషధంతో కొవిడ్​-19 మరణాలను తగ్గించవచ్చని, కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని పరిశోధక బృందం పేర్కొంది. ఈ సందర్భంగా దిల్లీ ఐఐటీ బయోకెమికల్ అండ్ బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.సుందర్ మాట్లాడుతూ... 'రోగ నిరోధక శక్తి పెంచే ఔషధంగా అశ్వగంధకు మంచి పేరుంది. తాజా పరిశోధన దీనికి వైరస్​పై పోరాడే శక్తి సైతం ఉందనే సంకేతాన్ని ఇచ్చింది' అన్నారు.

ఇదీ చూడండి:కరోనా విజృంభణ: లక్షకు చేరువలో కేసులు

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details