Medicine During Pregnancy Safe : గర్భిణీలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీలు రకరకాల మందులను వాడుతుంటారు. ఈ సందర్భంగా వాటి వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరి ఆ జాగ్రత్తలేంటంటే..
అవగాహన కలిగి ఉండాలి..!
Medicines In Pregnancy :ముందుగా గర్భిణీలు ఏ మందులు వాడాలి..? ఏవి వాడకూడదు..? అనే విషయాలను తెలుసుకోవాలి. చాలా మంది వివిధ సందర్భాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు రకరకాల మందులు వాడుతుంటారు. గర్భం దాల్చినప్పుడు కూడా వాటిని వాడొచ్చా? లేకపోతే ఆపేయాలా? అనే విషయాలపై కూడా అవగాహనను కలిగి ఉండాలి. ఇందుకోసం వైద్యుల్ని సంప్రదించి వారి సూచన మేరకే మందులు వేసుకోవాలి.
అప్పుడే గర్భం దాల్చండి..!
Medication During Pregnancy : గర్భధారణకు ముందు నుంచే మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే.. వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యులు విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. జీవనశైలిలో మార్పుల ద్వారా ఊబకాయం తగ్గించుకుని, మధుమేహం వంటి వ్యాధులు ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. ఆ తర్వాతనే గర్భం దాల్చాలి. గర్భం దాల్చిన తర్వాత కొన్ని రకాల మందులు మాములుగా వాడొచ్చు. అలర్జీ నివారణ మందులు కొనసాగించవచ్చు. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల వరకు జలుబు, ఫ్లూ వంటి వాటికి తీసుకునే మందుల వల్ల పెద్దగా సమస్యలు ఉండవు.
సొంత వైద్యం ప్రమాదకరం..!
మలబద్ధకానికి వాడే మందులు, ప్రాథమిక చికిత్స కోసం వాడే ఆయింట్‌మెంట్స్, క్రీములు గర్భిణీలకు 100 శాతం సురక్షితం అని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. గర్భిణీలు వివిధ రకాల నొప్పులకు మందులు( Can I Take Medication While Pregnant )వాడకం కంటే ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న థెరపీలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఆ 12 వారాలు కీలకం..!
గర్భం దాల్చిన తర్వాత మొదటి 12 వారాలు చాలా కీలకం. ఈ దశలోనే శిశువులో అవయవాలు తయారవుతాయి. ఈ సమయంలో ఫోలిక్ యాసిడ్ తప్ప ఏ మందులను వాడకూడదు. యాంటీ బయాటిక్స్ తీసుకోవడంలోనూ అప్రమత్తత అవసరం. వీటిలో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు ఉంటాయి. వీటిలో ఏ కేటగిరీ మందులు ఎంచుకోవడం ఉత్తమం.