తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Malasana Benefits: మలబద్దకం.. ఈ ఆసనంతో దూరం! - మలబద్దకంతో బాధపడే వారికి మలాసనం

యోగా నిత్య జీవితంలో భాగమైతే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మనలో చాలామందిని తరుచూ వేధించే వాటిలో మలబద్ధకం ఒకటి. దీనిని బయటకు చెప్పుకోలేక బాధపడే వాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచిస్తుంటారు. దీనితో బాధపడే వారికి ఓ యోగాసనం వేయడం వల్ల కొంతమేరు ఉపశమనం కలుగుతుంది. ఇంతకీ అదేంటంటే?

Malasana
మలాసనం

By

Published : Sep 17, 2021, 4:00 PM IST

రోజువారీ జీవితంలో యోగా ఓ భాగమైతే.. మనల్ని తరుచూ వేధించే అనేక అనారోగ్య సమస్యలకు విముక్తి దొరుకుతుంది. ఇలా నిత్య జీవితంలో కచ్చితంగా రోజు వేయాల్సిన ఆసనాల్లో ఒకటి మలాసనం (Malasana Benefits). దీనినే మాలాసనం అని కూడా అంటారు. అన్ని ఆసననాల్లో కల్లా ఇది చాలా శ్రేయస్కరమైనది. మలం అంటే వ్యర్థం. దీనిని రోజూ విసర్జించడం ద్వారా శరీరంలోని వ్యర్థాన్ని తొలగించుకోవచ్చు. శారీరకంగా ఉండే వ్యర్థాలను మాత్రమే కాకుండా.. మానసికంగా ఉండే ఉండే చెడు ఆలోచనలను కూడా దూరం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మూడు లేక నాలుగు రోజులుగా మల బద్దకంతో బాధపడే వారికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది.

మలాసనం

ఆసనం ఎలా వేయాలి..?

  • మలాసనం వేసే ముందుగా శరీరాన్ని ముందు వార్మప్​ చేసుకోవాలి. పాదాలను బద్దకోణాసనంలో ఉంచుకుని కిందకు పైకి అనాలి.
  • అలా చేసిన తరువాత కాళ్లు వెనక్కి పెట్టుకోవాలి. మోకాళ్లు ముందుకు ఉండేలా చూసుకోవాలి. ఆపై ధ్యాన భంగిమలో కూర్చోవాలి.
  • కళ్లు మూసుకొని మనసులో ఇష్ట దైవాన్ని స్మరిస్తుండాలి. కొంత సమయం తరువాత తలను ముందున్న నేలకు తాకేలా చూడాలి. ఈ సమయంలో ఊపిరి బాగా పీల్చితూ, వదలాలి.
  • ఇలా చేసేటప్పడు మన తొడల భాగంలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తుండాలి. తిరిగి పైకి లేవాలి. అనంతరం అధోముఖాసనంలోకి వెళ్లాలి. ఈ ఆసనం వేసేటప్పడు మన మోకాళ్లను కొంచెం ఆడిస్తూ ఉండాలి.
  • అనంతరం వీపు భాగాన్ని వార్మప్ చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు వీపులో ఉండే అన్ని కండరాలు కదిలేలా చూసుకోవాలి. తిరిగి అధోముఖాసనానికి రావాలి.
  • ఇలా చేసిన తరువాత మీరు తీసుకొన్న రెండు ఇటుకలపై తొడలను దూరంగా జరిపి కూర్చోవాలి. రెండు చేతులను నమస్కరిస్తున్నట్లు ముందుకు చూపించాలి.
  • ఇలా చేయడం వల్ల కాళ్లలో, ఇతర భాగాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతేగాకుండా శరీరంలో ఉండే చెడు పదార్థాలు బయటకు సులభంగా వచ్చేస్తాయి.

ఇదీ చూడండి:women health tips: ఆ సమయంలో విశ్రాంతి అవసరం

ABOUT THE AUTHOR

...view details