తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

లాక్​డౌన్ సమ్మర్​లో మీ డెయిలీ డైట్ ఇలా ఉందా?

సరైన పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటే కరోనా సోకకుండా నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత సమయంలో ఏది తింటే ఆరోగ్యంగా ఉంటాం అనేది అందరిలో మెదిలే ప్రశ్న. పౌష్టికాహారం తీసుకోవటం కూడా ఒక సవాలే. ప్రస్తుత లాక్​డౌన్ సమయంలో ఏ కూరగాయలు, పండ్లు తినాలి, ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోగలమో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.

Nutrition
లాక్​డౌన్​ సమయంలో పౌష్టికాహారం తీసుకోవటం ఎలా?

By

Published : May 18, 2020, 11:45 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో అందుబాటులో ఉన్నవాటిని తినడానికి తమను తాము అలవాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఓ సవాలుగా మారింది. అరుదుగా లభించే డ్రాగన్​ ఫ్రూట్​, రేగు పండ్లు, కివీ​, బ్రోకలీ, పార్లీ వంటివి ఇష్టపడేవారు హఠాత్తుగా క్యాబేజీ, బీన్స్, కొత్తిమీర​ మొదలైనవి తినాల్సి వచ్చింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో సీజనల్​ ఉత్పత్తులు మంచి ప్రోటీన్లను అందిస్తాయి. కూరగాయలు, పండ్లు అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇంట్లో ఉండే చిన్నపాటి గార్డెన్లు ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారికి తాజా కూరగాయలు, పండ్లు సమృద్ధిగా లభిస్తాయి.

స్థానికంగా లభించే ఆహారంలో పోషకాలతో పాటు రుచి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మూడు రకాల ఆహార పదార్థాలపై దృష్టిపెట్టాలి. అవి శక్తిని ఇచ్చేవి, శరీర ఆకృతిని పెంచేవి, రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు​.

విటమిన్​-ఏ,సీ,ఈ

సులభంగా లభించి, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాల వంటి సూక్ష్మపోషకాలు మన శరీరానికి చాల తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి కానీ.. అవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత లాక్​డౌన్​ సమయంలో విటమిన్​-ఏ, విటమిన్​-సీ, విటమిన్​-ఈ వంటి వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.

తీసుకునే ఆహారంలో ఎక్కువగా నట్స్​, చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అన్ని రకాల నట్స్​లో విటమిన్​-ఈ పుష్కలంగా ఉంటుంది. విటమిన్​-సీ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకకుండా ఉండేందుకు ఇది చాలా అవసరం. ఉసిరి, జామ, పచ్చి మామిడి, నిమ్మ, బత్తాయి, దానిమ్మ వంటి వాటిలో సీ విటమిన్​ అధికంగా ఉంటుంది. మొలకల్లో దీని​ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో లభించే చింతపండు, పెరుగు, నిమ్మకాయలు, లేత మామిడి వంటివి తినటం ద్వారా సీ విటమిన్​ లభిస్తుంది.

పసుపు రంగులో ఉండే పండ్లు, క్యారెట్​, మామిడి, జాక్​ఫ్రూట్​, బొప్పాయి వంటి కూరగాయల్లో విటమిన్​-ఏ పుష్కలంగా ఉంటుంది.

ఎముకలు బలంగా తయారయ్యేందుకు అవసరమైన కాల్షియాన్ని ఆహారం నుంచి శరీరం గ్రహించేలా విటమిన్​-డీ ఉపయోగపడుతుంది. రాగి, పాలు, పాలపదార్థాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.

ప్రస్తుతం లాక్​డౌన్​తో అందరం ఇంట్లోనే ఉంటున్నాం. విటమిన్​-డీ పొందేలా ఉదయం 8.30 లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత సూర్యరశ్మిలో ఉండాలి.

శరీరంలో నీటి శాతాన్ని ఎలా కాపాడుకోవాలి?

24 గంటలు ఇంటిలోనే ఉన్నప్పటికీ కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. పళ్ల రసాలు, నిమ్మరసం వంటివి శరీరంలో నీటి శాతాన్ని పెంచి డీహైడ్రేషన్​ కాకుండా చూస్తాయి. అవసరమైన విటమిన్లు అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ వంటి నీటి శాతం అధికంగా ఉన్న పండ్లను తీసుకోవటం ద్వారా డీహైడ్రేషన్​ కాకుండా చూసుకోవచ్చు.

పరిమితమైన ఆహార పదార్థాల లభ్యతను దృష్టిలో పెట్టుకుని చిన్నారుల్లో ఆరోగ్యకర ఆహార అలవాట్లను ఎలా పెంచొచ్చు?

  1. పిల్లలకు మంచి కార్బోహైడ్రేట్స్​ కావాలి. అవి చిరు ధాన్యాలు, పండ్లలో లభిస్తాయి. చపాతీలు, దోసెలు, బియ్యం, భక్రీ వంటివి కార్బోహైడ్రేట్స్​ను ఎక్కువగా కలిగి ఉంటాయి. మంచి శక్తిని ఇస్తాయి. అల్పాహారాలతో కలిపి పండ్లను చిన్నారులకు అందించటం ద్వారా శక్తి అందటమే కాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  2. పిల్లల్లో ఎదుగుదలకు మంచి ప్రోటీన్లు అవసరమవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ప్రోటీన్లు ఉండే చేపలు, చికెన్​ అందిచటం చాలా కష్టం. కాబట్టి బాదం, పిస్తా, వేరుశెనగ, పప్పులు, ఉడికించిన చెనగలు వంటివి ఇవ్వటం ద్వారా యాంటి ఆక్సిడెంట్స్​ సహా ప్రోటీన్లు అందుతాయి.
  3. వైరస్​ నుంచి రక్షణ కల్పించే విటమిన్స్​, మినిరల్స్​... పండ్లు, కూరగాయల్లో అధికంగా లభిస్తాయి. రోజుకు కనీసం 3-4 రకాల పండ్లయినా పిల్లలకు అందించాలి. సూప్స్​, పరాఠా, కట్లెట్​ వంటి వాటితో కూరలు ఇవ్వాలి.

వాటితో పాటు కురగాయలు, పండ్లు తినటం ద్వారా కరోనా వైరస్​ను ఏ విధంగా చంపుతాయో పిల్లలకు వివరించండి. వివరణాత్మకంగా చిత్రాలు గీసి చూపండి. రిఫ్రిజిరేటర్​పై ఆ బొమ్మలను అంటించండి. మీ పిల్లలు జంక్​ ఫుండ్​ తినాలనుకుంటే ఇంట్లోనే కట్​లెట్​ వంటివి తయారు చేసి ఇవ్వండి. వంట చేయటంలో వారు సాయం చేసేలా చూడండి. వారికి చిన్న చిన్న పనులు చెప్పండి. వివిధ రకాల ఆహార పదార్థాల గురించి వివరించండి. వివిధ పదార్థాలను తెలుసుకునేలా చేయండి.దాని ద్వారా చిన్నారుల్లో వాటిపై ఆసక్తి పెరుగుతుంది.

- వందనా కకోద్కర్​, పౌష్టికాహార నిపుణులు

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details