Reason for Irregular Periods :ప్రతి ఆడపిల్లకూ రుతుక్రమం తప్పనిసరి. ఓ వయసు వచ్చాక వారిలో నెలనెలా పీరియడ్స్ రావడం అనేది సహజం. అయితే.. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పీరియడ్స్(Periods)సమస్య ఎదుర్కొంటున్నారు. సకాలంలో రాకపోవడం.. బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీంతో.. కొందరు మహిళలు ఆ సమస్యకు కారణం తెలియకుండానే వివిధ హార్మోన్లకు సంబంధించిన మందులు వాడుతున్నారు. ఇలా వాడడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పీరియడ్స్ సమయానికి ఎందుకు రావు? దానికి గల కారణాలేంటి..? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి..? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ సైకిల్లో పడకండి..
మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణంగా.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల పీసీఓడీ(PCOD) లాంటి ఆరోగ్య సమస్యలతోపాటు ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటికోసం.. మందులు వాడాల్సి వస్తుంది. ఫలితంగా.. చాలా మంది స్త్రీలు బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల పీరియడ్స్ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇలా.. ఓ అనారోగ్యకర సైకిల్లో మహిళలు పడిపోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం బరువు పెరగడం అని చెబుతున్నారు. మహిళ్లల్లో బరువు పెరగడం రుతుక్రమాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరికొన్ని కారణాలు..
ఇంకా..సమయానికి తిండి తినకపోవడం, నిద్రలేమి, జీవనశైలిలో మార్పు కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణం అవుతాయని చెబుతున్నారు. ఆడపిల్లల్లో పొట్టచుట్టూ చేరే కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు. దీని కారణంగా శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దాంతో సమయానికి అండం విడుదల కాదు. వీటన్నింటీ కారణంగా నెలసరి సక్రమంగా రాదు. అప్పుడు నెలసరి సరిచేసేందుకు హార్మోన్ మాత్రలు వాడాల్సి వస్తుంది. మందులతో మరిన్ని సమస్యలు వస్తాయి.