Liver cirrhosis treatment: కాలేయం ఓ కెమికల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ సరిగా పని చేస్తేనే మన మనుగడ సాధ్యం అవుతుంది. దానికి ఇన్‌ఫెక్షన్లు, హెపటైటీస్, మరికొన్ని రకాల జబ్బులు సోకవడంతో దెబ్బతింటోంది. పొగ, మద్యం లాంటి అలవాట్లు కూడా పెను ప్రమాదంలో పడేస్తున్నాయి. లివర్ సిర్రోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయం కణజాలం సిమెంట్ ముద్దలా మారుతుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిర్రోసిస్ గురించి ప్రముఖ వైద్యులు ఏమంటున్నారంటే...
కాలేయం బండరాయిలా మారొద్దంటే.. ఈ జాగ్రత్తలు మస్ట్!
Liver cirrhosis: కాలేయానికి వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమారు 500 రకాల పనులు చేసే కాలేయం దెబ్బతింటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లివర్ సిర్రోసిస్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు.
లివర్‌కు ఇబ్బందులు ఎందుకొస్తాయి..?
Liver cirrhosis symptoms: లివర్ చాలా మెత్తగా ఉండే అవయవం. ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడినపుడు కాలేయం ఉబ్బిపోతుంది. క్రమేపి ఇన్‌ఫెక్షన్లతో రాయిలా గట్టిగా తయారవుతుంది. దీంతో రక్తకణాలు దెబ్బతింటాయి. కాళ్ల వాపు వస్తుంది. రక్త వాంతులు అవుతాయి. ఇది చేసే 500 రకాల పనులన్నీ ఆగిపోవడంతో ప్రాణాంతకంగా మారుతుంది. దీనికంతటికి పొగ, ఆల్కాహాల్ తాగడమే కారణం. హెపటైటీస్ ఎ,బీ,సీ వైరస్‌లతో కూడా ఇలాంటి ప్రమాదమే తలెత్తుతుంది. అందువల్ల మద్యం, పొగ తాగడం మానుకోవాలని వైద్యులు జాగ్రత్తలు చెబుతున్నారు.
చికిత్స ఎలా చేస్తారు?
లివర్ సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. కాపాడుకునే స్థితిలో ఉందో లేదో నిర్థారించుకోవాలి. సిర్రోసిస్ వచ్చిన తర్వాత ఏం చేయలేం. రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వాడాలి. వ్యాయామం చేయాలి. సిర్రోసిస్ తీవ్రమైన తర్వాత లివర్‌ను మార్చేయాల్సిందే. 80 శాతం కాలేయం పాడయినా బాగు చేయవచ్చు. ముందుగా గుర్తించినట్లయితే ఏ సమస్య రాకుండా చర్యలు తీసుకోవచ్చు.