తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ చిట్కాలతో మధుమేహం రాకుండా జాగ్రత్తపడండి! - షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి

వయసుతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం చాలామంది మధుమేహం బారినపడుతున్నారు. ఆహార అలవాట్లు, అనారోగ్య జీవనశైలి దానికి దోహదం చేస్తున్నాయి. పూర్తిగా డయాబెటిక్​గా మారకముందు ఉండే 'ముందస్తు మధుమేహ' (prediabetes) దశలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. అవి ఏంటంటే?

pre diabetic
ముందస్తు మధుమేహం

By

Published : Sep 13, 2021, 4:10 PM IST

Updated : Sep 13, 2021, 4:55 PM IST

ప్రస్తుతం మనలో చాలామందికి షుగర్​ లెవెల్స్​ 100కు పైగానే ఉంటున్నాయి. అంటే వీళ్లందరూ డయాబెటిస్ బారినపడటానికి దాదాపుగా సిద్ధంగా ఉన్నట్లే. షుగర్​ లెవెల్స్​ 100 దాటి 120 దిశగా దూసుకెళ్తుంటే వైద్యులు దానిని ప్రీ-డయాబెటిస్ స్టేజ్ (ముందస్తు మధుమేహం) అంటారు. కనీసం ఈ దశలో అయినా జాగ్రత్తపడితే ముందస్తు మధుమేహం (prediabetes) పూర్తి స్థాయి షుగర్​ జబ్బుగా మారకుండా నివారించుకోవచ్చు.

ముందస్తు మధుమేహానికి అడ్డుకట్ట వేయడం ఎలా?

ప్రీ డయాబెటిస్ బయటపడిన నాటి నుంచే షుగర్​ పేషంట్స్​ అనుసరించే డైట్, లైఫ్​ స్టైల్​ను (diet to reverse prediabetes) ఫాలో అయితే.. డయాబెటిక్​గా మారకుండా ఉండే అవకాశం ఉంది.

ఏం తినొచ్చు..?

డైట్​లో (diabetes diet) కార్బోహైడ్రేట్స్​ తగ్గించాలి. ముఖ్యంగా వైట్​ రైస్​ తగ్గించి, దానికి ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్, రోటీలను తింటే మంచిది. కర్రీస్​ తక్కువ తింటున్నట్టు అయితే దాని మోతాదు పెంచండి. కాఫీ, టీలలో చక్కెర వేసుకోకుండా ఉండటం మంచిది. లేదా షుగర్​ ఫ్రీ వాడటం మేలు. పండ్లు ఏవైనా తినొచ్చు. బ్రెడ్, బిస్కెట్, మైదా, బేకరీ ఐటెమ్స్​ తినడం మంచిది కాదు.

వ్యాయామాలు..

షుగర్​ పేషెంట్లు (exercise for diabetes) కనీసం రోజుకు అరగంట వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 రోజులు ఏరోబిక్స్​ (కార్డియాక్ ఎక్సర్​సైజులు లాంటివి), 2 రోజులు మజిల్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలు పెరిగి, కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. దీని ద్వారా డయాబెటిక్​గా మారకుండా ప్రీ డయాబెటిస్​ స్టేజిలోనే ఉండొచ్చు, లేదా నార్మల్​ కూడా అయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:మధుమేహం అదుపులో ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!

Last Updated : Sep 13, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details