Laptop On Lap Effects in Telugu: ఈ జనరేషన్‌లో ఫోన్ల తర్వాత ల్యాప్‌టాప్ అత్యవసర టూల్‌గా మారింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, గేమింగ్, వీడియోలు, సినిమా, ప్రాజెక్ట్ వర్క్.. మొదలైన పనులు చేయడానికి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ.. లాప్‌టాప్ వాడేస్తున్నారు. లాప్‌టాప్‌లు పోర్టబుల్‌గా, వాడుకోవడానికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీటి వినియోగం పెరిగిపోయింది. బెడ్, సోఫా, ఛైర్, టేబుల్ ఇలా ఎక్కడంటే అక్కడ కూర్చోని.. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడుతుంటారు కొందరు. అయితే, లాప్‌టాప్‌ను డైరెక్ట్‌గా శరీరానికి తాకించి వాడితే.. అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ అనేక ఫ్రీక్వెన్సీలలో EMFలను విడుదల చేస్తుందని.. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు. మీరు కూడా.. ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేసుకుంటున్నారా.. మరి ఆ నష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!
పునరుత్పత్తి అవయవాలకు హాని:చాలా మంది లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేస్తుంటారు. అయితే అలా చేయడం కంఫర్ట్‌గా అనిపించినా.. ఈ అలవాటు పునరుత్పత్తి వ్యవస్థకు హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాప్‌టాప్.. వైర్‌లెస్ ఇంటర్నెట్ సిగ్నల్‌లను (మైక్రోవేవ్‌లు) అందుకుంటుంది. అలాగే అనేక ఫ్రీక్వెన్సీలలో EMFలను విడుదల చేస్తుంది. కాళ్లపై పెట్టుకుని ల్యాప్‌టాప్ వాడితే.. మగవారిలో స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం పడగా, మహిళలలో ఎగ్ రిలీజ్ సక్రమంగా జరగదని అంటున్నారు. అలాగే ల్యాప్‌టాప్ కాళ్లపై పెట్టుకుని వాడితే.. వృషణాల దగ్గర, స్పెర్మ్ కణాల DNA దెబ్బతింటుందని అర్జెంటీనాలో నిర్వహించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఇది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా? - అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే!
కొన్ని క్యాన్సర్ల ముప్పు:ల్యాప్‌టాప్‌ను కాళ్లపై పెట్టుకుని వాడితే.. దాని నుంచి ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చర్మం దెబ్బతింటుందని, ఇది స్కిన్ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని యూనివర్శిటీ హాస్పిటల్ బాసెల్‌కు చెందిన స్విస్ పరిశోధకులు తెలిపారు. పునరుత్పత్తి అవయవాలకు దగ్గరగా ల్యాప్‌టాప్ పెట్టుకుంటే.. వృషణ, అండాశయ క్యాన్సర్ల ముప్పును పెంచుతుందని స్పష్టం చేశారు.