తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కొవాగ్జిన్​, కొవిషీల్డ్, స్పుత్నిక్​-వి మధ్య తేడా ఏంటి? - కొవాగ్జిన్​ కొవిషీల్డ్ టీకాలు

భారత్​లో కొవాగ్జిన్, కొవిషీల్డ్​ టీకాలతో పాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​-వి వ్యాక్సిన్​ కూడా వచ్చే వారం అందుబాటులోకి వస్తోంది. ఈ మూడు టీకాల్లో ఏది ఎక్కు వ సమర్థవంతం? దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? డోసుల మధ్య వ్యవధి ఎంత ఉండాలనే విషయాలు తెలుసుకోండి.

covaxin vs covishield vs sputnik-v
కొవాగ్జిన్​, కొవిషీల్డ్, స్పుత్నిక్​-వి మధ్య తేడా ఏంటి?

By

Published : May 15, 2021, 10:08 AM IST

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న వేళ.. మరో టీకా అందుబాటులోకి రావడం ఊరటనిస్తోంది. ఇప్పటికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వినియోగంలో ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాను అత్యవసరంగా ఉపయోగించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. వచ్చేవారం ఈ వ్యాక్సిన్ మార్కెట్​లోకి రానుంది.

అయితే ఈ మూడు టీకాల సమర్థత ఎంత? టీకా వేయించుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి? రెండు డోసుల మధ్య విరామం ఎంత ఉండాలి? ఏ పద్ధతిలో వాటిని తయారు చేశారో ఓసారి చూద్దాం.

covaxin
కొవిషీల్డ్ టీకా
స్పుత్నిక్ వి టీకా
  • స్పుత్నిక్- వి టీకాను భారత్​లో ఉత్పత్తి చేసేందుకు డా.రెడ్డీస్​ సంస్థ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
  • కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి 6-8 వారాలు ఉండాలని మొదట ప్రభుత్వం తెలిపింది. 12-16 వారాల తేడా ఉంటే టీకా 90 శాతం సమర్థంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలడం వల్ల ఇటీవలే ఆ మేరకు వ్యవధిని పొడిగించింది.
  • కరోనాపై ప్రభావం చూపుతున్నాయని పరిశోధనల్లో తేలాకే ఈ మూడు టీకాలకు అనుమతులిచ్చారు. టీకా తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత పెరుగతుంది. వైరస్ ద్వారా ప్రాణాలు కోల్పోయే ముప్పు కచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా మీకు అందుబాటులో ఉన్న టీకాను తీసుకొని మహమ్మారిపై పోరులో విజయం సాధించేందుకు సహకరించండి.

ABOUT THE AUTHOR

...view details