తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

దోమలను ఆయుర్వేదంతో అంతం చేయండిలా! - how to get rid of Mosquitos

దోమ ఏడాదికో కొత్త రోగాన్ని ప్రవేశపెడుతోంది. పోనీ వాటిని అంతం చేద్దామని లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్ల వంటివి వాడుదామంటే.. అవి దోమలను మన ఆరోగ్యంపైనే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అందుకే మనిషికి హాని కలగకుండా దోమల్ని, అవి సృష్టించే రోగాల్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా ఎలా దూరం చేయొచ్చో చూద్దాం రండి!

kill Mosquito with Neem Leaves and other ayurvedic techniques
దోమలను ఆయుర్వేదంతో అంతం చేయండిలా!

By

Published : Aug 3, 2020, 10:31 AM IST

ఈ కాలంలో డైనోసర్లు ఉంటే వాటి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ దోమ కాటు నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం నిత్యం ఎవరికైనా రక్త దానం చేస్తున్నామంటే అది ఒక్క దోమలకే! మరి వాటి బెడద తప్పెదెలాగో చూసేయండి.

ఆయుర్వేదంతో అంతం

సిగరెట్ కంటే ప్రమాదం.. వాటిని వదిలేయండి !

మనం నిత్యం వెలిగించే మస్కిటో కాయిల్స్ ఒక్కటి చాలు.. దాని వల్ల 70 నుంచి 120 సిగరెట్లు కాల్చితే వచ్చే పొగ పీల్చినట్లే! శాస్త్రీయంగా దీనిని నిరూపించకపోయినా కొంతమంది మాత్రం ఇందులో నిజం లేకపోలేదంటున్నారు. అందుకే అది నిజమో, అబద్ధమో తర్కించే బదులు చక్కగా ఇలా సహజ సిద్ధమైన చిట్కాల్ని ఫాలో అయిపోమంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

నిత్యం మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి 15 నిమిషాల పాటు పొగ వేస్తే.. ఇక దోమలు మళ్లీ ఇంట్లోకి రావంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకవేళ వేప ఆకులు లేనట్త్లెతే కర్పూరంతో పొగ వేసినా పర్లేదంటున్నారు. మిరియాల చెట్టు కొమ్మలు దొరికినా వాటిని కాల్చి పొగవేస్తే దోమలు మాయమవడం ఖాయమట.

ఆయుర్వేదంతో అంతం

ఆవాల పొడి, వేప ఆకుల పొడి, సముద్రపు ఉప్పు మూడూ తగిన మోతాదులో కలుపుకోవాలి. తర్వాత నాలుగు బొగ్గులని వేడి చేసుకొని ఒక మట్టిపాత్రలో వేసుకోవాలి. ఇంటి తలుపులు, కిటికీలు మూసి పొడిని కొంచెం కొంచెంగా బొగ్గులపై చల్లుకుంటూ ఇల్లంతా పట్టాలి. పై వాటిలానే దోమల్ని తరిమేయడానికి ఇదో చక్కని ఉపాయం అంటున్నారు.

ఆయుర్వేదంతో అంతం

ఇప్పుడు బొగ్గులెక్కడి నుండి వస్తాయనుకునే వారు అరోమాల్యాంప్స్‌లో కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, జామాయిల్ నూనె (యూకలిప్టస్ ఆయిల్), లెమన్ గ్రాస్ నూనె, తేయాకు నూనె, లావెండర్ నూనె వీటిలో ఏదైనా ఒక్కటి వేసి పెట్టుకుంటే సువాసనతో పాటు దోమల బెడద కూడా ఉండదు.

నాలుగు వెల్లుల్లిపాయలను దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకొని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు చనిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ కంటే ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటున్నారు.

బాల్కనీ లేక ఆరు బయట పడుకునే వారు వేప నూనెకి అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకొని పడుకుంటే ఎనిమిది గంటల వరకూ దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చు.

ఇంటి చుట్టూ నీరు ఉంచకండి!

వర్షకాలంలో నిలువున్న నీరే ప్రమాదకరం అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. దోమలకి ఆ నీరే నివాసం కనుక తప్పకుండా ఇంట్లో, ఇంటి సమీపంలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలి.

ఒకవేళ నిలువ ఉన్న నీరు తీయడానికి సమయం పడుతుందనుకుంటే తులసి రసాన్ని కానీ నూనెని కానీ ఆ నీటిపై, దోమలున్న ప్రాంతంలో చల్లాలి. తులసి రసానికి డింభక నాశని అని పేరు. ఇది దోమల లార్వాని నాశనం చేస్తుంది.

ఈ మొక్కలను తప్పక పెంచండి !

ఇంటి చుట్టూ తులసి, వేప, జామాయిల్/యూకలిప్టస్ వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుంది. ఒక కుండీలో అలొవెేరా పెంచుకుంటే దోమ కాటుకి బాగా పని చేస్తుంది. కొన్ని దోమలు కుడితే బాగా మంటపుట్టడం, పెద్ద పెద్ద దద్దుర్లు రావడం సహజం. ఆ సమయంలో చిన్న అలొవేరా ముక్కను కట్ చేసి ఆ ప్రాంతంలో రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు తులసి ఆకులని కానీ వేప ఆకులని కానీ పేస్ట్‌గా చేసి దోమ కుట్టిన చోట రాసుకుంటే ప్రభావవంతంగా ఉంటుంది.

ఆయుర్వేదంతో అంతం

మరికొన్ని చిట్కాలు !

ఆయుర్వేదంలో తిప్ప తీగని సర్వరోగ నివారిని అంటుంటారు. దీని ఆకులని రసంగా తీసి కొంచెం తులసి ఆకుల రసంతో కలిపి సేవిస్తే దోమల ద్వారా వచ్చే రోగాలు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు.

మూడు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్‌ని ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేసినా దోమ కాటు నుంచి కాపాడుకోవచ్చు.

శారీరక దృఢత్వంతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారు త్వరగా ఎటువంటి రోగాలకి గురికారు. ఆఖరికి దోమ వల్ల వచ్చే రోగాలకి కూడా.. ! కాబట్టి నిత్యం వ్యాయామం, మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి. చివరగా దోమ తెరలని వాడటం మర్చిపోకండి.

ఇదీ చదవండి: ఐరిష్​ మగువల అందం వెనుక అసలు రహస్యాలివే!

ABOUT THE AUTHOR

...view details