తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కన్యతో శృంగారమే థ్రిల్లింగ్‌ ఎందుకు...? - ఈటీవీ సుఖీభవ

Sex With A Virgin: ప్రకృతిలో మనిషికి అత్యంత ఆనందం ఇచ్చే అంశాల్లో శృంగారం ఒకటి. ఈ ప్రత్యేక అనుభూతి ఇచ్చే కిక్కే వేరు. అయితే, కన్య(వర్జిన్)లతో సెక్స్ చేస్తే థ్రిల్లింగ్​గా అనిపిస్తుందని కొంతమందిలో అపోహ ఉంటుంది. ఇది నిజమేనా?

etv bharat Sukhibhava
etv bharat Sukhibhava

By

Published : Mar 31, 2022, 3:35 PM IST

Sex With A Virgin: కన్యతో శృంగారం చాలా గొప్పగా, ఎంతో మజాగా ఉంటుందని కొందరు అనుకుంటుంటారు. అయితే ఇది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ప్రాథమిక సూత్రం.. మానసికంగా ఇరువురూ దగ్గరగా ఉండటమేనని అంటున్నారు. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు, సన్నిహిత సంబంధం ఉండటం అన్నిటికన్నా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.

'శృంగారం చేసే ఇద్దరి మధ్య లోతైన భావనలు ఉండాలి. ఇరువురూ ఒకరినొకరు గాఢంగా ప్రేరేపించుకోవాలి. అంతే తప్ప కన్యతోనే శృంగారం చేస్తే గొప్పగా ఉంటుందని అనుకోవడం తప్పు. ఇద్దరి మధ్య అవగాహన, సహకారం, ప్రోత్సాహం, కామం ఉంటేనే కలయికలో సంతృప్తి లభిస్తుంది. శృంగారం చేసే వ్యక్తిపై మహిళకు ఎలాంటి భావనలు లేకపోతే.. ఆ సెక్స్​లో ఎలాంటి మజా ఉండదు. కన్య అయినా, సాధారణ మహిళ అయినా ఇది ఒక్కటేనని గుర్తుంచుకోవాలి. నిజానికి వివాహిత మహిళ.. అత్యంత ప్రేరణతో సెక్స్​లో పాల్గొంటే.. వెయ్యి రెట్లు ఎక్కువగా సంతృప్తి లభిస్తుంది' అని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ తింటే సెక్స్ పవర్ పెరుగుతుందా?
ఉల్లిపాయ వల్ల ఆరోగ్యానికి ఉన్న ప్రయోజనాలు ఎన్నో. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అయితే ఉల్లిపాయ తింటే సెక్స్ పవర్ పెరుగుతుందని చాలా మంది అంటుంటారు. అందుకే అదే పనిగా ఉల్లిపాయలు ఎక్కువగా తింటుంటారు. ఇంట్లో వివిధ వంటల్లోనూ అధికంగా ఉల్లిపాయలు వాడుతుంటారు. మరి ఉల్లిపాయ నిజంగానే సెక్స్ పవర్ పెంచుతుందా? తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details