హస్త ప్రయోగానికి సంబంధించి సమాజంలో ఇలా ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా మంది తమ యుక్త వయసులోనే హస్త ప్రయోగానికి అలవాటు పడుతుంటారు. కొందరికి గడ్డం, మీసాలు రావడం ఆలస్యమవుతుంది. కొందరికి ఆరోగ్య కారణాల వల్ల అసలే రాకపోవచ్చు. ఈ క్రమంలో అలా గడ్డం, మీసాలు రాని వారు కొందరు.. హస్త ప్రయోగం వల్లేకు తమకు అవి రావడం లేదనే బాధతో డాక్టర్లు సంప్రదిస్తున్నారు. అయితే అందులో నిజమెంత? హస్త ప్రయోగానికి గడ్డాలు, మీసాలకు సంబంధం ఉందా? హస్త ప్రయోగం విపరీతంగా చేసుకుంటే.. గడ్డాలు, మీసాలు రావా? ఎన్ని నెలల ఆది చేయడం ఆపేస్తే.. అవి వస్తాయి?
హస్త ప్రయోగం నేపథ్యంలో వచ్చే అపోహలు పూర్తిగా అవాస్తవమని.. దాని వల్ల లాభాలే కాని.. నష్టాలు లేవని డాక్టర్లు, అధ్యయనాలు, నిపుణులు చెబుతున్నారు. గడ్డాలు, మీసాలు రావడానికి హస్త ప్రయోగానికి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన సమస్యల వల్లే.. గడ్డాలు, మీసాలు రాకపోవడానికి కారణమని వెల్లడించారు. గడ్డాలు, మీసాలు రావడానికి ఎలాంటి మందులు లేవని, దాని గురించి ఆలోచించించవద్దని సలహా ఇస్తున్నారు.
- హస్త ప్రయోగం వల్ల వీర్య పల్చగా అవుతుందా? అలా అయితే పిల్లులు పుట్టరా? చిక్కగా కావాలంటే ఏం చేయాలి?