Periods Twice in a Month Reasons :మహిళల్లో పీరియడ్స్ అనేవి కామన్. ఓ వయసు వచ్చాక ఇవి ప్రారంభమవుతాయి.ఇకపోతే సాధారణంగా ఆరోగ్యవంతమైన మహిళలల్లో పీరియడ్స్ ప్రతి 28 రోజులకు ఒకసారి వస్తాయి. ఇక కొందరి శరీర తత్వాన్ని బట్టి 24 నుంచి 35 రోజుల మధ్య వస్తుంటాయి. ఇది సాధారణమైనప్పటికీ.. కొందరికి ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్(Periods)వస్తుంటాయి. మరి ఇలా రావడం సాధారణమేనా? దీని వెనుక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సాధారణంగా రుతుచక్రం వ్యవధి 28 రోజులు. రుతుస్రావం 3-5 రోజులు ఉంటుంది. అయితే ఈ రుతుక్రమం సైకిల్ ప్రతి 28 రోజులకొకసారి కాకుండా 24 రోజులకొకసారి వస్తే ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావచ్చని.. ఇది సాధారణమే అని.. ఈ పీరియడ్స్ వ్యవధి అందరిలో ఒకేలా ఉండదంటున్నారు. అలా కాకుండా వస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాల్సిందేనని.. అంతే కాకుండా ఈ పరిస్థితి తలెత్తడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నారు.
పాలీమెనోరియా :ఈ సమస్య వల్ల కూడా నెలలో రెండుసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. ఇది రెండు రుతుచక్రాల మధ్య వ్యవధిని దాదాపు 21 రోజులకు తగ్గిస్తుంది. అంటే ఈ సమస్య ఉన్నవారిలో మిగతావారికంటే త్వరగా నెలసరి వస్తుంది. ఇది సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం బెటర్.
గర్భనిరోధక మాత్రలు :కొందరు పిల్లలు పుట్టకుండా కొన్ని రకాల మందుల్ని యూజ్ చేస్తుంటారు. పీరియడ్స్‌పై అవి కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మీరు గర్భనిరోధక మాత్రలు, ఇంప్లాంట్లు లేదా హార్మోన్ల ఇంట్రాయూటెరైన్ పరికరాలను తీసుకుంటే.. రక్తస్రావం జరుగుతూ ఉండవచ్చు లేదా పీరియడ్స్ మధ్య చుక్కలు కనిపించవచ్చు. అలాగే వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటి కారణంగా కూడా నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడం జరుగుతుంది.
పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!