వ్యాయామం ముగించిన తర్వాత కాసేపైనా విశ్రాంతి తీసుకోకపోతే శారీరక, మానసికారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వ్యాయామ సమయంలో పెరిగే గుండె వేగాన్ని మెల్లగా అదుపులోకి తేవాలి. లేదంటే తల తిరిగినట్లు, వికారంగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని క్షణాలు ధ్యానం చేస్తే, గుండె లయ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మనసూ ప్రశాంతమవుతుంది. వ్యాయామాలు అయ్యాక పది నిమిషాలు కొన్ని తేలికైన ఆసనాలను వేస్తే కండరాల్లోని ఒత్తిడి క్రమబద్ధం అవుతుందంటున్నారు నిపుణలు.
వ్యాయామం తర్వాత విశ్రాంతి కచ్చితంగా అవసరమా..? - women health
కొంతమంది మహిళలు ఉదయంపూట వ్యాయామం చేస్తుంటారు. కానీ.. వ్యాయామం అయ్యీ అవ్వగానే పనుల్లో పడిపోతుంటారు. ఈ పద్ధతి ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వ్యాయామం తర్వాత కొద్దిసేపైనా విశ్రాంతి అవసరమని సూచిస్తున్నారు.
![వ్యాయామం తర్వాత విశ్రాంతి కచ్చితంగా అవసరమా..? Is it definitely necessary to rest after exercise](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15013590-1039-15013590-1649901706474.jpg)
Is it definitely necessary to rest after exercise
మొదట మోకాళ్లపై కూర్చుని రెండు చేతులను ముందుకు చాచి అరచేతులు అలాగే తలను కూడా నేలకు ఆనేలా నిమిషం పాటు ఉంచాలి. తర్వాత మోకాళ్లను, అరచేతులను నేలకు ఆనించి తలను నేలవైపు చూస్తున్నట్లుగా మరో నిమిషముండాలి. ఇలా రెండుమూడు సార్లు చేశాక యోగముద్రలో మరో 5 నిమిషాలుండి, ఆ తర్వాత శవాసనం వేస్తే చాలు. క్రమేపీ శరీరంలోని గుండె సహా అవయవాలపై ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. యధావిధిగా రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. వ్యాయామాలతో ప్రయోజనాలనూ పొందొచ్చు.
ఇవీ చూడండి: