తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుడ్డు పచ్చసొన తింటే నిజంగానే ఆరోగ్యానికి ముప్పు? - రీసెర్చ్​లో ఆసక్తిర విషయం! - egg yolk effects on fatty liver is true or not

Is Egg Yolk Good or Bad For Fatty Liver: చాలా మంది ఎగ్స్​ను తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే అందులో కొందరు తెల్లసొన తిని పచ్చసొనను పడేస్తారు..? అంతేకాకుండా గుడ్డు పచ్చసొన వల్ల ఫ్యాటీ లివర్​ ఏర్పడుతుందని భావిస్తారు. అసలు అందులో నిజమెంత..? నిజంగానే దీనివల్ల నష్టాలు ఉన్నాయా..? అంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం..

Etv Bharat
Is Egg Yolk Good or Bad For Fatty Liver

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 12:55 PM IST

Is Egg Yolk Good or Bad For Fatty Liver:చాలా మంది ఏదో రకంగా రోజూ గుడ్డు తింటుంటారు. ఎందుకంటే ఇది పోషకాల పవర్​హౌజ్​ కాబట్టి. ఇందులో రైబోఫ్లేవిన్, నియాసిన్, క్లోరిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, జింక్.. వంటి ఖనిజాలు, విటమిన్‌ ఎ, సి, కొద్ది మోతాదులో డి , ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్, క్యాల్షియం, కాపర్, సల్ఫర్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో ప్రొటీన్‌‌‌‌‌ సమృద్ధిగా ఉంటుంది.

అయితే.. చాలా మంది గుడ్డు తెల్లసొన తిని.. పచ్చసొన వదిలేస్తారు. ఎందుకంటే గుడ్డు పచ్చసొన తింటే.. కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని, లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని​భావిస్తారు. మరికొందరు మాత్రం గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతుంటారు. దీంతో.. ఏది నిజమో తెలియక జనం అయోమయానికి గురవుతుంటారు. వాస్తవం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

Fatty Liver Disease Treatment : 'ఫ్యాటీ లివర్' సమస్య వేధిస్తోందా?.. వాటికి దూరంగా.. వీటికి దగ్గరగా ఉంటే చాలు!

ఫ్యాటీ లివర్​ అంటే ఏమిటి:లివర్​లో కొవ్వు శాతం కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ రెండు రకాల కారణాలతో ఏర్పడుతుంది. మొదటిది ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మాత్రం జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి లక్షణాలు అధికమైతే కాలేయం వాపు, హెపటైటిస్‌, సిరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి.

ఫ్యాటీ లివర్​ లక్షణాలు:

  • పొత్తికడుపులో నొప్పి
  • విపరీతమైన అలసట
  • వికారం
  • ఆకలి లేకపోవడం
  • అకస్మాత్తుగా బరువు తగ్గడం
  • చర్మం రంగు మారడం
  • ఉదరం వాపు
  • కాళ్లు, పాదాలలో వాపు,
  • రక్తస్రావం మొదలైనవి లక్షణాలుగా చెప్పుకోవచ్చు..

లివర్​ చెడిపోతోందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ హెల్తీగా..

గుడ్డు పచ్చసొన తినడం వల్ల ఫ్యాటీ లివర్​ సమస్య వస్తుందా? : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్డు పచ్చసొన సాపేక్షంగా కొలెస్ట్రాల్​ను ఎక్కువ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. అలాగే ప్రొటీన్.. లిపిడ్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదలతో పాటు కాలేయంపై మరింత భారాన్ని సృష్టిస్తుంది. ఇది చివరికి కాలేయం సిర్రోసిస్‌కు దారి తీస్తుంది.

గుడ్లను డైట్​లో ఎలా తీసుకోవాలి:పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్యాటీ లివర్​, సిర్రోసిస్ వంటి ఇతర సమస్యలు ఉన్నవారు సగటున వారానికి 1-3 గుడ్లు మాత్రమే తినాలి. అందులోనూ.. ఫ్రై చేసిన వాటి కంటే.. ఉడికించిన గుడ్లను తినాలంటున్నారు.

Fatty Liver Disease: కాలేయం కొవ్వెక్కితే.. గుర్తించేదెలా.. జాగ్రత్తలేం తీసుకోవాలి?

అధ్యయనాలు ఏం చెప్తున్నాయి:

  • 2018లో "న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు పచ్చసొనను 12 వారాల పాటు తిన్న నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వారిని.. తినని వారితో పోలిస్తే కాలేయ కొవ్వు స్థాయిలను గణనీయంగా పెరిగినట్లు తెలిపారు.
  • 2020లో "జర్నల్ ఆఫ్ హెపటాలజీ" జర్నల్‌లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం.. NAFLD ఉన్న వ్యక్తులు 12 వారాల పాటు రోజుకు ఒక గుడ్డు పచ్చసొనను తిన్నవారిలో, గుడ్డు పచ్చసొన తినని వారితో పోలిస్తే కాలేయ వాపు గణనీయంగా పెరిగిందని కనుగొన్నారు.
  • 2021లో "లివర్ ఇంటర్నేషనల్" జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం.. 12 వారాలపాటు రోజుకు ఒక గుడ్డు పచ్చసొనను తినే NAFLD ఉన్న వ్యక్తులు.. గుడ్డు సొన తినని వారితో పోలిస్తే కాలేయం దెబ్బతినడాన్ని గణనీయంగా పెంచినట్లు కనుగొన్నారు.

లివర్​లో కొవ్వు పేరుకుపోయిందా.. ఆ పని మానేయండి!

ABOUT THE AUTHOR

...view details