తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Intermittent Fasting Tips : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?.. దీని వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారా? - health stories in telugu

Intermittent Fasting Tips In Telugu : ఉపవాసం గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (నామమాత్రపు ఉపవాసం) గురించి విన్నారా ? బరువు తగ్గడానికి.. శక్తి, ఆరోగ్యం మెరుగుపర్చుకోవడానికి ఇదొక ఉత్తమ పద్ధతి. మరి దీన్ని ఎలా పాటించాలి? ఏమేమి చేయాలి? అనే అంశాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

best methods for Intermittent Fasting
Intermittent Fasting Tips

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 3:32 PM IST

Intermittent Fasting Tips :ఉపవాసం అంటే తెలియని భారతీయులు ఉండరు. మన జీవన విధానంలో ఇదొక భాగం. ఆయా ముఖ్యమైన సందర్భాల్లో ఉపవాసం ఉండటం పరిపాటి. కొంత మంది ఉపవాసంఉండేటప్పుడు చాలా కఠినమైన పద్ధతులు పాటిస్తారు. ఆహార పదార్థాలే కాదు.. కనీసం మంచి నీళ్లు కూడా తీసుకోరు. కానీ కొందరు మాత్రం టీ, పాలు, పండ్లు, అల్పాహారం లాంటివి తీసుకుంటారు. రోజంతా అన్నం తినకుండా ఉండి ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటారు.

కానీ, మీరెప్పుడైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (నామమాత్రపు ఉపవాసం) గురించి విన్నారా ? బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇదొక శక్తిమంతమైన పద్ధతి. కొత్తగా, మొదటిసారిగా ఉపవాసం ఉండాలనుకునేవారు.. ఈ పద్ధతిని పాటించడం మంచిది. అయితే దీనిని ఎలా పాటించాలి? ఏమేం చేయాలి? ఇందు కోసం నూతన సాంకేతికతను ఎలా ఉపయోగించాలి? మొదలైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

16/8 విధానంతో ప్రారంభించండి
16/8 Intermittent Fasting : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకునేవారు మొదటగా పాటించాల్సింది 16/8 విధానం. ఇది అత్యంత సరళమైన, ప్రజాదరణ పొందిన ఉపవాస పద్ధతి. దీని ప్రకారం 24 గంటల్లో 16 గంటల పాటు ఉపవాసం పాటించి.. మిగిలిన 8 గంటల సమయంలో ఒకటి లేదా రెండు సార్లు తినటం. ఉదాహరణకు రోజు ప్రారంభంలో అల్పాహారం మానేసి.. మధ్యాహ్నం మొదటి సారి తిని, తర్వాత రాత్రి భోజనంతో మీ రోజును ముగించవచ్చు. ఇది కొవ్వు అధికంగా కరగడంలో తోడ్పడుతుంది. మీ ఉపవాసాన్ని మరింత సులభతరం చేయడానికి 'Fasting' లాంటి యాప్​లను ఉపయోగించవచ్చు. ఇది మీ ఉపవాసం, ఆహార వేళలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రిమైండర్లను సెట్ చేసి పురోగతిని పర్యవేక్షిస్తుంది.

మీల్స్, స్నాక్స్ ముందుగానే ప్లాన్ చేసుకోండి
Plan Best Food For Fasting : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు కచ్చితంగా.. మీ భోజనాన్ని ముందే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఇది తరచుగా ఆహారం తీసుకోవాలనే మీ కోరికను అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా మీ శరీరం తగినంత పోషకాలు, క్యాలరీలు పొందడంలో సాయపడుతుంది. ఇందుకోసం Mealime , Eat This Much లాంటి యాప్స్​ను ఉపయోగించవచ్చు. ఈ మీల్ ప్లానింగ్ యాప్​లు మీ ఆహార ప్రాధాన్యం, గోల్స్ ఆధారంగా కస్టమైజ్డ్ మెనూ రూపొందిస్తాయి. వీరు సులభంగా చేసుకోగల వంటకాలు, షాపింగ్ జాబితా, విలువైన పోషకాహార సమాచారాన్ని సైతం అందిస్తాయి.

ఉపవాసం ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి!
Fasting Hydration Remedies :ఉపవాసం ఉన్నప్పుడు బాగా నీళ్లు తాగాలి. దీని వల్ల శరీరంలోని టాక్సిక్ పదార్థాలు బయటికి వెళ్లి, ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. నీళ్లు బాగా తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీని వల్ల చిరాకు రాకుండా ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల స్నాక్స్ లాంటి పదార్ధాల జోలికి పోకుండా ఉంటాం.

ఉపవాసం చేసేటప్పుడు శుద్ధి చేసిన నీటిని తాగవచ్చు లేదా రుచి కోసం అందులో పుదీనా, నిమ్మ రసం లాంటివి కలుపుకుని తాగవచ్చు. ఉపవాసం చేసినప్పుడు రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. కానీ ఈ సమయంలో చక్కెర పానీయాలు, ఆల్కహాల్​తో పాటు కెఫిన్లకు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా.. ఉపవాసం సరైన క్రమంలో చేస్తున్నామా? లేదా? తెలుసుకోవడానికి మీల్ ట్రాకర్ యాప్​ లాంటివి ఉపయోగించుకోవాలి. లేదంటే Water Reminder లాంటి యాప్​లు డౌన్​లోడ్ చేసుకుని వాడుకోవాలి.

వ్యాయామం చేయడం
Intermittent Fasting Exercise : ఉపవాసం ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే.. త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే కొత్తగా ఉపవాసం చేసే వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభంలో తక్కువ ప్రభావం చూపే సాధారణ వ్యాయామాలు చేయడం ఉత్తమం. మీ శరీరం ఉపవాసానికి అలవాటుపడిన తరువాత క్రమంగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటే సరిపోతుంది. వాస్తవానికి ఇందుకోసం యూట్యూబ్​లో చాలా వీడియోలున్నాయి. పలు ఛానెళ్లు ట్యుటోరియళ్లను సైతం అందిస్తున్నాయి.

శరీర సంకేతాల్ని గమనించండి
Intermittent Fasting Body Indications : ఉపవాస సమయంలో మీ శరీరం కొన్ని సంకేతాలిస్తుంది. అందుకు తగ్గట్లే మీ ప్రణాళికలో మార్పులు చేసుకోవాలి. బలహీనంగా అనిపించినా, కళ్లు తిరిగినట్లు అనిపించినా.. అరటి పళ్లు, పాలు లాంటి తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. శరీర సంకేతాల్ని గమనించడం కోసం యాక్టివిటీ-ట్రాకింగ్ జర్నలింగ్ యాప్స్​ను ఉపయోగించవచ్చు. మీ మూడ్, ఎనర్జీ లెవెల్స్, బరువులో మార్పులు ట్రాక్ చేయడానికి Evernote, Notion యాప్​లు పనికొస్తాయి.

మంచి డైట్ పాటించండి
Good Diet For Intermittent Fasting :ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సమయంలో మంచి డైటింగ్ పాటించడం చాలా అవసరం. ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తినడానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రాసెస్డ్ ఫుడ్, యాడెడ్ షుగర్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను కచ్చితంగా పక్కన పెట్టాలి. ఇవి రక్తంలో చెక్కర స్థాయిపై ప్రభావం చూపి ఉపవాసానికి అంతరాయం కలుగజేస్తాయి. మంచి సమతుల్యమైన డైట్​ను పాటించేందుకు MyFitnessPal, Yummly లాంటి డైట్ ట్రాకింగ్ యాప్​లు ఉపయోగపడతాయి. ఈ యాప్​లు కేలరీల వినియోగాన్ని లెక్కించడంలో కూడా మీకు సహాయపడతాయి.

ABOUT THE AUTHOR

...view details