తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వానల జోరు.. అసలే అంటువ్యాధులు.. ఈ చిట్కాలతో సేఫ్..

Infectious Diseases Rainy Season: దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పటికే అక్కడక్కడా వానలు పడుతున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. వీటికి అంటువ్యాధులు తోడైతే ఏమైనా ఉందా? మరి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు ఏమంటున్నారు? చూద్దాం.

Infectious Diseases during Rainy Season
Infectious Diseases during Rainy Season

By

Published : Jun 2, 2022, 7:01 AM IST

Infectious Diseases Rainy Season: వర్షాకాలంలో సాధారణంగా.. ఎక్కువగా దగ్గు, జలుబు వంటి అంటువ్యాధుల బారిన పడుతుంటారు. దీనినే ఫ్లూ అని కూడా అంటాం. వాతావరణ మార్పుల వల్ల, ఇతరత్రా వైరస్​ల కారణంగా ఇలాంటి వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇవి సీజనల్​గా వస్తున్నాయ్​ అనుకొని నిర్లక్ష్యంగా ఉంటే చిక్కుల్లో పడ్డట్లే. కరోనా విజృంభణ, మంకీపాక్స్​ కలకలం నేపథ్యంలో చిన్నచిన్న వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యనిపుణులు.

దగ్గు, జలుబును ముందే గుర్తించి.. యాంటీబయాటిక్​ తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. వ్యాధి తీవ్రం కాకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఉన్నప్పుడే నోట్లో ఉప్పునీళ్లు పోసుకొని పుక్కిలించడం వంటి చిన్నచిన్న చిట్కాలు పాటించాలని సలహా ఇస్తున్నారు.
ఇంకా వైరల్​ ఫీవర్స్​ ముఖ్యంగా డెంగీ, మలేరియా పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇవి దోమల కారణంగా వస్తాయి గనుక.. దోమల నిర్మూలన కోసం మందులు, దోమతెరలు వాడటం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. అలాగే టైఫాయిడ్​, కామెర్లు లాంటి సీజనల్​​ వ్యాధుల బారినపడితే వెంటనే ఆస్పత్రిలో చేరడం మంచిదని చెబుతున్నారు.

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారం, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివరిస్తున్నారు. ఇంకా వానాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు ఏం చెప్పారో? ఈ వీడియోలో చూడండి.

ABOUT THE AUTHOR

...view details