మధుమేహం (చక్కెర వ్యాధి) తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్ తీసుకోవడం సర్వసాధారణం. ఇన్సులిన్ పాడవకుండా రిఫ్రిజరేటర్‌లో భద్రపర్చాలి. లేదంటే కొన్ని గంటల తర్వాత గడ్డకట్టి పనికిరాకుండా పోతుంది. ఈ సమస్య పరిష్కారానికి కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(ఐఐసీబీ) పరిశోధకులు ఓ సరికొత్త మాలిక్యూల్‌ని గుర్తించారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ ఇన్సులిన్‌ని గడ్డకట్టకుండా ఉంచే ఈ మాలిక్యుల్‌కు ‘ఇన్సులాక్’ అని పేరు పెట్టారు. దీనిని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)లో న్యూక్లియర్ మాగ్నటిక్ రెసోనెట్స్(ఎన్‌ఎంఆర్) ల్యాబ్‌లో పరీక్షించారు. ఇన్సులిన్‌లో ఇన్సులాక్ కలిపిన తర్వాత దాని నిర్మాణాన్ని త్రీడీలో పరీక్షించి సాధారణ ఉష్ణోగ్రతలోనూ గడ్డకట్టడంలేదని గుర్తించారు. అనంతరం కోల్‌కతాలోని ఐఐసీబీలో ఎలుకలపై ప్రయోగించారు. ఆ పరీక్షలు విజయవంతం కావడంతో.. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రఖ్యాత జర్నల్ ‘ఐసైన్స్’లో ఇటీవల ప్రచురితమైంది.
ధరలు తగ్గే అవకాశం