Immunity Increase Food In Telugu :ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు శరీరం తట్టుకొని నిలబడాలి. ఇందుకు రోగనిరోధక శక్తి ఎంతో కీలకం. మరి రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏటువంటి ఆహారాలు తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఇవి మన ఒంట్లో రోగనిరోధక శక్తి పెంచుతాయి. మరి మన శరీరంలో ఇమ్యునిటీ పవర్‌ను పెంచే 'సూపర్ ఫుడ్స్' గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవగాహన కలిగి ఉండాలి..!
ఆహారమే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారం వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కలిగినా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏయే ఆహారాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో అనేదానిపై అవగాహన కలిగి ఉండాలి.
సమతుల ఆహారం తీసుకోవాలి..!
వర్షాకాలం వచ్చిందంటే చాలామంది తరచుగా జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. ఇలాంటి వ్యాధులు రాకుండా, ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకోవాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం సమతుల ఆహారం తీసుకోవాలి.
సహజ పద్ధతుల్లో విటమిన్లు తీసుకోవాలి..!
విటమిన్లు, ఖనిజాలు లభించే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చాలామంది జలుబు చేసినప్పుడు సి-విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటారు. ఇందుకు కారణం సి-విటమిన్ అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదే సహజసిద్ధమైన పద్ధతుల్లో సి-విటమిన్‌ను ఆహారం ద్వారా తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలుంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు..!
నిమ్మ, ద్రాక్ష, నారింజ, ఎరుపు రంగు క్యాప్సికంలో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో బీటా కెరోటిన్ అనే పోషకం కూడా ఉంటుంది. దీనిని మన శరీరం ఏ విటమిన్‌గా మార్చుకుంటుంది. బ్రకోలీలో కూడా ఏ, సి, ఈ విటమిన్లు లభిస్తాయి. ఇందులోని పీచు పదార్థాసు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.