తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆ నీటిని తాగండి.. కరోనాను తరిమికొట్టండి! - aava water to improve immunity

మన జీవనశైలిని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం వల్ల ఎన్ని వ్యాధులు వచ్చినా... డాక్టర్లకు డబ్బులు పోస్తే తగ్గిపోతుంది అనుకొని ఇన్నాళ్లు గడిపేశాం. కానీ, కరోనా మహమ్మారి వచ్చింది. ప్రంపచానికి ఆరోగ్యకరమైన జీవనం విలువ తెలిసేలా చేసింది. మందులేని ఈ వైరస్​ను ఎదుర్కోవాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం తప్ప మరో మార్గంలేదని స్పష్టం చేసింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో మీ రోగనిరోధక శక్తిని పెంచి, కొవిడ్​ నుంచి కాపాడగలిగే 'ఆల్కలైన్​​' నీటి గురించి మీకు తెలుసా?

Immunity boosting Aava alkaline water extends helping hand during the current health crisis
ఆ నీటిని తాగండి.. కరోనాను తరిమికొట్టండి!

By

Published : Jun 19, 2020, 11:48 AM IST

సాధారణ ప్యూరిఫైడ్​ నీటిని తాగడం కంటే 'ఆల్కలైన్​' నీటిని తాగడం వల్ల.. కరోనాను ఎదుర్కోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. నోబెల్ గ్రహీత డాక్టర్ ఒట్టో వార్బర్గ్ ప్రకారం, ఆల్కలైన్ నీటిని సేవించే శరీరం.. సాధారణ ఆమ్ల నీరు తాగే శరీరం కంటే 20 శాతం ఎక్కువగా ఆక్సిజన్‌ను గ్రహించగలదు. పైగా ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆల్కలైన్​ అంటే?

పీహెచ్​ విలువ అత్యధికంగా ఉండే నీటిని 'ఆల్కలైన్'​ నీరు అంటారు. మనం తాగే ప్యూరిఫైడ్​ నీటిలో పీహెచ్​ శాతం చాలా తక్కువ. హీహెచ్​ శాతం తగ్గే కొద్దే ఆమ్ల శాతం పెరుగుతుంది. అది ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడదు. కానీ, ఆల్కలైన్​​ నీటిలో పోషకాలు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. ఇది క్యాన్సర్​, కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది.

ఆవా-సేవా

అహ్మదాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎంఇ, ఆవా-1000 సంస్థలు సంయుక్తంగా సహజ ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆవా నీటిలో పీహెచ్​ 8 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటుంది. బైకార్బోనేట్లు, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, రాగి, జింక్ మొదలైన ఖనిజాలూ వీటిలో ఉంటాయి. ఆవా నీటిలో సిట్రేట్ శరీర జీవక్రియపై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఈ వాటర్​ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల.. అది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పతుంది. ఎముకలు, కండరాలు, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా కరోనాను తరిమికొట్టడంలో తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అంతే కాదు, లాక్​డౌన్​ సమయంలో ఆస్పత్రులు, కొవిడ్ -19 నిర్బంధ కేంద్రాలు, వలస శిబిరాల్లోని రోగులకు ఆల్కలైన్​ నీటిని ఉచితంగా సరఫరా చేస్తోంది ఆవా సంస్థ.

మనం ఆరోగ్యాలపై శ్రద్ధ వహించే సమయం ఇది. సామాజిక దూరం, మాస్క్​ ధరించడం వంటి కరోనా జాగ్రత్తలతో పాటు... స్వచ్ఛమైన, ఖనిజ సంపన్నమైన ఆల్కలీన్ నీరు తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోగలరు.

ఇదీ చదవండి:ఇలా వ్యాయామం చేస్తే.. చలిగిలి పరారే​!​

ABOUT THE AUTHOR

...view details